మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ భక్త సంద్రమైంది
వేములవాడ: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ భక్త సంద్రమైంది. సోమవారం రాజన్నను దర్శించుకునేందుకు పలు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వేములవాడ చేరుకున్నారు. శివరాత్రి సందర్భంగా జరిగే జాతరకు సోమవారం సుమారుగా 4 లక్షల మంది హాజరుకానున్నారు.
స్వామి వారికి ప్రభుత్వ తరఫున జిల్లా కలెక్టర్ నితూకుమారీ పట్టువస్త్రాలను సమర్పించారు. అంతేకాకుండా, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఆలయ పూజారులు రాజన్న స్వామికి పట్టు వస్త్రాలను అందించారు.