భళా అనిపించిన సాహస 'జ్యోతి'

PET Teacher Was First Woman From Telangana To Climb Mount-Kilimanjaro - Sakshi

సాక్షి, దుబ్బాక(సిద్దిపేట) : కృషి..పట్టుదల ఉంటే అసాధ్యాన్ని..సుసాధ్యం చేయడం పెద్దగా లెక్కకాదు. అని నిరూపించింది వ్యాయామ ఉపాధ్యాయురాలు జ్యోతి. రాష్ట్రంలోనే కిలిమాంజారోని పర్వత శ్రేణిని అధిరోహించిన మొదటి మహిళా ఉద్యోగిణిగి నిలిచింది.  అత్యంతం కష్టమైనదక్షిణ ఆఫ్రికా ఖండంలోని టాంజానీయా దేశంలో ఉన్న కిలిమంజారో పర్వతాలను అధిరోహించి దేశం ఖ్యాతిని చాటింది.  అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు కలిగిన పర్వత శ్రేణి కిలీమాంజారో పర్వతాలు.

సముద్రమట్టానికి 5895మీటర్ల ఎత్తులో ఉంది. ఎన్నో శారీరిక, మానసికి సమస్యలను తట్టుకుని ధృడ సంకల్పంతో పర్వతాన్ని అధిరోహించడం ఓ అద్భుత సాహసం. 2017 డిసెంబర్‌ 22 న పర్వతారోహణ ప్రారంభించిన జ్యోతి కఠిన పరిస్థితుల్లోను ముందుగా మందార, హురంభో, కిబో పర్వతాలను రెండు రోజుల్లో అధిరోహించింది.25 న అత్యంత క్షిష్టమైన గిల్మస్, స్టెల్లా,హురు పర్వత శిఖరాలను అధిరోహించి కిలీమంజారో యాత్రను విజయవంతం చేసింది. కిలీమంజారోను అధిరోహించిన మొట్టమొదటి మహిళా ప్రభుత్వ ఉద్యోగిగా జ్యోతి నిలిచింది. అంత ఎత్తులో ఎత్తులో భారత జాతీయ పతాకాన్ని, తెలంగాణ చిత్ర పటం, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిల చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించింది.   

పీఈటీ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో.. 
దుబ్బాక మున్సిపల్‌ పరిధిలోని ధర్మాజీపేటలో నాయీబ్రాహ్మణ కుటుంబం ఏల్దీ గంగయ్య పద్మ దంపతులకు కూతురు జ్యోతి. పేదకుటుంబంకావడంతో తల్లిదండ్రులకు అండగా ఉంటూ చదువుకుంటూ బడిలో పీఈటీ ఏర్వ అశోక్‌ ప్రోత్సాహంతో క్రీడల్లో రాణించింది.  2012 డీయస్సీలో మంచి ర్యాంక్‌ సాధించి వ్యాయామ ఉపాధ్యాయురాలుగా నియమితురలైంది. ప్రస్తుతం జ్యోతి  దుబ్బాక మండలంలోని చిట్టాపూర్‌ హైస్కూల్‌లో పీఈటీగా సేవలందిస్తుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top