హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కౌశిక్‌రెడ్డి | Padi Kaushik Reddy Huzurabad Assembly Constituency Karimnagar | Sakshi
Sakshi News home page

హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కౌశిక్‌రెడ్డి

Nov 19 2018 12:27 PM | Updated on Mar 18 2019 7:55 PM

Padi Kaushik Reddy Huzurabad Assembly Constituency Karimnagar - Sakshi

పాడి కౌశిక్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కాంగ్రెస్‌ పార్టీ హుజూరాబాద్‌ అభ్యర్థిగా పాడి కౌశిక్‌రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం ఆదివారం రాత్రి ప్రకటించింది. ఆయనకు బీ ఫారం అందించింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 స్థానాలకుగాను 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ హుస్నాబాద్‌ను సీపీఐకి అప్పగించింది.

హుజూరాబాద్, కోరుట్ల స్థానాలకు పదిరోజులుగా సస్పెన్స్‌ కొనసాగుతోంది. టీపీసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ సిఫార్సు మేరకు హుజూరాబాద్‌ను కౌశిక్‌రెడ్డికి.. కోరుట్ల జువ్వాడి నర్సింగరావుకు ప్రకటించారు. ఈ మేరకు ఇద్దరు అభ్యర్థులకు బీ ఫారాలను అందించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement