శభాష్‌.. శామీర్‌పేట | Sakshi
Sakshi News home page

శభాష్‌.. శామీర్‌పేట

Published Tue, Jan 3 2017 3:09 AM

శభాష్‌.. శామీర్‌పేట - Sakshi

వంద శాతం నగదు రహిత గ్రామంగా రికార్డు
అధికారికంగా ప్రకటించిన శాసనమండలి విప్‌


సాక్షి, జనగామ: ఒకప్పుడు బూట్ల చప్పుడు.. పోలీసుల కవాతులతో ఉలిక్కిపడిన కుగ్రామం ఇప్పుడు ఓ అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. అప్పటి పీపుల్స్‌వార్‌ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన గ్రామ స్తులు ఇప్పుడు ఐక్యతతో నడుం కట్టారు. వంద శాతం నగదు రహిత లావాదేవీలు జరుపుతున్న గ్రామంగా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. జనగామ జిల్లాలోని శామీర్‌పేటను శాసనమండలివిప్‌ బోడ కుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కలెక్టర్‌ శ్రీదేవసేనలు సంపూర్ణ నగదు రహిత గ్రామంగా సోమవారం ప్రకటించారు. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన శామీర్‌ పేటలో 669 గృహాలు ఉండగా 2,686 మంది జనాభా ఉన్నారు. 18ఏళ్లు నిండి యువతీ యువకులు 1,830 మంది ఉన్నారు. వీరిలో 1,820మందికి బ్యాంకు ఖాతాలను అందిం చారు. 1,820 ఖాతాలను ఆధార్‌ కార్డు నంబరు, మొబైల్‌ నంబరుకు అనుసంధానం చేశా రు. ఇప్పటికీ 1,008మంది ఏటీఎం, డెబిట్‌ కార్డులతో లావాదేవీలను నిర్వహిస్తున్నారు.

ఇంటింటికి ఖాతాలు..
సీఎంతో జరిగిన కలెక్టర్ల సమీక్ష సమావేశంలో పాల్గొన్న నగదు రహిత లావాదేవీలను కొన సాగించేటట్లు కలెక్టర్లు కృషిచేయాలని సీఎం కేసీఆర్‌ కోరారు. దీనితో కలెక్టర్‌ శ్రీదేవసేన బ్యాంకర్లతో సమావేశాన్ని నిర్వహించి శామీర్‌ పేటను నగదు రహిత గ్రామంగా తీర్చిది ద్దడానికి ఎంచుకున్నారు.  54 మహిళ సంఘా లు, ఐదు యూత్‌ క్లబ్‌ల సభ్యులతో ఇంటింటి సర్వే చేపటి బ్యాంకు అకౌంట్లు, ఏటీఎం పిన్‌ నంబర్లు ఇచ్చారు. ఆరు మిషన్లను దత్తత తీసుకున్న ఎస్‌బీఐ జనగామ శాఖ గ్రామానికి అందించింది. వారం రోజుల నుంచి కిరాణం షాపుల్లో స్వైపింగ్‌ మిషన్ల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement