బాబోయ్‌ ధరలు... ఫిర్యాదుల వెల్లువ

omplaint To The Department Of Civil Supplies About Increment Of Vegetable Rates - Sakshi

పౌరసరఫరాల నంబర్లకు నిత్యావసరాలపై 400 మంది ఫోన్లు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిత్యావసరాల ధరల పెరుగుదలపై పౌర సరఫరాల శాఖకు ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా కూరగాయలు, పప్పుల ధరలు పెంచేస్తున్నారంటూ వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. గురువారం ఒక్కరోజే ఇలాంటివి నాలుగు వందల వరకు వచ్చాయి. వీటితో పాటే రేషన్‌ బియ్యం సరఫరా, ప్రభుత్వం ప్రకటించిన రూ.1,500 సాయం ఎప్పటిలోగా వేస్తారన్న అంశాలపైనా అధికంగా ఫోన్‌లు చేశారు. రేషన్‌ వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణకు పౌర సరఫరాలశాఖ 1967, 180042500333 టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు 7330774444 వాట్సాప్‌ నంబర్, 040–23447770 ల్యాండ్‌లైన్‌ నంబర్‌ను అందుబాటులో ఉంచింది. అధిక ధరలకు నిత్యావసరాలు విక్రయించారన్న ఫిర్యాదులను వాటికి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. ఈ నంబర్లకు ఉదయం 10 గంటల నుంచే ఫోన్‌లు మొదలయ్యాయని వినియోగదారుల ఫోరం డైరెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. ఇక ఫిర్యాదులను క్రోడీకరించి జిల్లాల వారీగా విభజించి ఆయా జిల్లా అధికారుల పరిశీలనకు పంపారు. వాటి ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top