కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద నర్సుల ఆందోళన 

Nurses Protest At Hyderabad Over TIMS Notification - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని కోఠి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ సుమారు 150మంది నర్సులు ఆందోళనకు దిగారు. ‘టిమ్స్‌’లో కరోనా సేవల కోసం కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియామకం చేపడతామని చెప్పిన అధికారులు మాట తప్పారంటూ నిరసన చేపట్టారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పని చేస్తున్న తమను నోటిఫికేషన్‌ అంటూ తీసుకొచ్చి రోడ్డున పడేశారని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కాంట్రాక్ట్‌ పద్ధతి అంటూ తమని మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన వారిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. నర్సులు తమ ఆందోళనను కొనసాగిస్తూ... తమ సమస్యపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు.(చదవండి : ‘హైదరాబాద్‌ నగరాన్ని గాలికొదిలేశారు’)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top