అగ్నికీలలపై ఆధునికాస్త్రాలు | new mini fire engines | Sakshi
Sakshi News home page

అగ్నికీలలపై ఆధునికాస్త్రాలు

May 8 2014 3:40 AM | Updated on Sep 13 2018 5:22 PM

అగ్నికీలలపై ఆధునికాస్త్రాలు - Sakshi

అగ్నికీలలపై ఆధునికాస్త్రాలు

అగ్నిప్రమాదం జరిగిందంటే చాలు ఠన్.. ఠన్.. ఠన్.. అంటూ వచ్చేస్తుంది గంటల బండి. ఎక్కడ మంటలంటుకున్నా నోట్లో నుంచి వచ్చే మొదటిమాట ‘ఫైరింజన్‌కు ఫోన్ చేయండి..’ అనే.

వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : అగ్నిప్రమాదం జరిగిందంటే చాలు ఠన్.. ఠన్.. ఠన్.. అంటూ వచ్చేస్తుంది గం టల బండి. ఎక్కడ మంటలంటుకున్నా నోట్లో నుంచి వచ్చే మొదటిమాట ‘ఫైరింజన్‌కు ఫోన్ చేయండి..’ అనే.  ఇప్పుడు మరింత ఆధునిక అస్త్రాలు సమకూర్చుకుంది అగ్నిమాపక శాఖ. ఎండాకాలమంటేనే..మండేకాలం. అగ్నిప్రమాదాలు ఈ కాలంలోనే ఎక్కువగా చోటుచేసుకుం టుంటాయి.

ఈ నేపథ్యంలో నూతన అస్త్రాలను సమకూర్చుకున్న అగ్నిమాపక యంత్రం గురించి..వీటర్ అండ్ ఫోమ్ టెండర్  వాహనం(మేజర్ వెహికిల్) ఇప్పటిక వరకూ వాటర్ టెండర్.. ఫోమ్ టెండర్..విడివిడిగా ఉండేవి. రసాయనాల వల్ల మంటలు చెలరేగితే అదుపుచేయడానికి ఫోమ్, ఇతర కారణాలతో జరిగిన అగ్నిప్రమాదాలకు వాటర్‌ను వినియోగించేవారు. ఇప్పుడు ఒకే వాహనంలో ఈ రెండు సదుపాయాలు వచ్చేశాయి. భారీ అగ్నిప్రమాదాలు జరిగినా చక్కగా పనిచేస్తుంది.

ప్రత్యేకతలు
4,500 లీటర్ల నీటిసామర్థ్యం, 4,500లీటర్ల ఫోమ్ దీనిసొంతం, రియర్ మౌంటెడ్ పంప్స్ దీనికి అమర్చారు. డ్రైవర్, సిబ్బంది కూర్చునే క్యాబిన్ పైభాగంలో మానిటర్ ఉంటుంది. దీంతో మామూలు ఫైరింజన్‌ల కంటే రెట్టింపుస్థాయి ప్రెషర్‌తో నీటిని బయటకు చిమ్ముతుంది. ప్రమాదస్థలికి 20అడుగుల దూరం నుంచే మంటల్ని అదుపు చేయవచ్చు. మానిటర్‌ను 90డిగ్రీల కోణంలో ఏ దిశలో కావలంటే ఆ దిశలో తిప్పుకోవచ్చు.

మినిఫైర్ ఇంజిన్(మిస్ట్)
చిన్నపాటి అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు.. ఇరుకైన సందుల్లోకి వెళ్లాల్సి వచ్చినపుడు పెద్ద వాహనంతో కష్టమే.  ఇలాంటి చోట్లకు దూసుకెళ్లి.. క్షణాల్లో మంటలను ఆర్పేందుకు వచ్చిన వాహనమిది.
 

 

ప్రత్యేకతలు
300లీటర్ల నీటి సామర్థ్యం, 50లీటర్ల ఫోమ్ కలిగివుంటుంది. చిన్నసందుల్లో దూసుకెళ్ల గలుగుతుంది. చిన్నదైనా నీ రు, ఫోమ్ కలిగి ఉండటం ప్రత్యేకత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement