ముక్కుపచ్చలారని మూడు రోజుల పసికందును నిర్ధాక్షిణ్యంగా వదిలి వెళ్లారు. నల్గొండ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తిప్పర్తి: ముక్కుపచ్చలారని మూడు రోజుల పసికందును నిర్ధాక్షిణ్యంగా వదిలి వెళ్లారు. నల్గొండ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని శేషమ్మగూడెం ఎస్‌టీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో సోమవారం ఉదయం మూడు రోజుల పసికందును ఎవరో వదిలి వెళ్లారు. పిల్లవాడు ఏడుస్తుంటే చుట్టుపక్కలవాళ్లు గమనించి బాబును సముదాయించారు. ఎవరో పసికందును వదిలి వెళ్లారని బావించి ఏసీడీఎస్ వాళ్లకు సమాచారం అందించారు.