దేశ రక్షణలో ఎన్‌సీసీ పాత్ర కీలకం | Sakshi
Sakshi News home page

దేశ రక్షణలో ఎన్‌సీసీ పాత్ర కీలకం

Published Sun, Aug 17 2014 2:47 AM

దేశ రక్షణలో ఎన్‌సీసీ పాత్ర కీలకం

ఆదిలాబాద్ స్పోర్ట్స్ :  దేశ రక్షణలో ఎన్‌సీసీ కేడెట్ల పాత్ర కీలకమని, దేశ రక్షణలో అత్యధికంగా ఎన్‌సీసీ కేడెట్లే ఉన్నారని 32వ ఆంధ్ర బెటాలియన్ నిజామాబాద్ గ్రూప్ కమాండర్ బీఎస్ గోకుల అన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని సీసీఐ టౌన్‌షిప్‌లో ఎన్‌సీసీ కేడెట్లకు ఇస్తున్న శిక్షణ తరగతులు శనివారం ఎనిమిదో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేడెట్లు తమ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలన్నారు. ఇందులో కేడెట్లు తలసేన క్యాంపు కఠిన శిక్షణ తీసుకున్నారు.
 
వీటితోపాటే నేలపై పాకడం.. మ్యాప్ రీడింగ్.. తాడుతో సాహసాలు, ఫీల్డ్ సిగ్నల్స్, ఫైర్ ఆర్డర్స్, రిటన్ టెస్ట్‌లో మెళకువలు నేర్చుకున్నారు. వివిధ రాష్ట్రాల మధ్య జరిగే తలసేన క్యాంపులో నిజామాబాద్ గ్రూప్ నుంచి ఎక్కువ సంఖ్యలో స్థానాలు సాధించాలని కోరారు. అనంతరం పాటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ 32 ఆంధ్ర బెటాలియన్ ఆదిలాబాద్ కమాండెంట్ రవిచందర్, ఎన్‌సీసీ అధికారులు శివప్రసాద్, జగ్‌రాం, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, నరేందర్, విజయ్‌కుమార్, రాజమౌళి, రాజేశ్వరి, స్వరూపరాణి, టీకే ప్రసన్న, సబేధర్ మేజర్ ధారాసింగ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement