ఆఫ్టరాల్‌ కాదు.. ఇది కొలెస్టరాల్‌!

National Nutrition Organization Comments About Cholesterol Rate - Sakshi

ఆసియా దేశాల్లో పెరుగుతున్న వైనం

సాక్షి, హైదరాబాద్‌: ఆసియాలోని పలు దేశాల్లో గుండెకు హాని కలిగించే కొలెస్టరాల్‌ పెరుగుతున్నట్లు అంతర్జాతీయ అధ్యయనం స్పష్టం చేసింది. ఇదే సమయంలో పాశ్చాత్య దేశాల్లో రక్తంలోని కొలెస్టరాల్‌ తగ్గుతోందని, భారత్‌లో మాత్రం పెద్దగా మార్పులేదని ఈ అధ్యయనంలో భాగం వహించిన జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) సీనియర్‌ శాస్త్రవేత్త ఆవుల లక్ష్మయ్య తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో రక్తంలోని కొలెస్టరాల్‌పై జరిగిన అతిపెద్ద అధ్యయనం ఇదేనని, లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది పరిశోధకు లు పాల్గొన్నారన్నారు. దాదాపు 200 దేశాల్లోని సుమారు 10 కోట్ల మందిని పరిశీలించి మరీ శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారని వివరించారు. 1980 నుంచి 39 ఏళ్ల పాటు ఈ పరిశీలనలు జరిపారన్నారు. కొలెస్టరాల్‌ కారణంగా ఏటా సుమారు 39 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని.. ఈ నేపథ్యంలో వెల్‌కమ్‌ ట్రస్ట్, బ్రిటిష్‌ హార్ట్‌ ఫౌండేషన్లు నిధులు సమకూర్చాయని ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ ఆర్‌.హేమలత ఓ ప్రకటనలో తెలిపారు.

చెడు కొవ్వుతోనే సమస్య.. 
ఒక రకమైన కొవ్వు పదార్థం ఆరోగ్యకరమైన క ణాల తయారీకి అవసరం. అయితే అవసరానికి మించి ఎక్కువైతే రక్తనాళాల్లో పేరుకుపోయి గుండెపోటుకు కారణమవుతుంది. హైడెన్సిటీ లి పోప్రొటీన్‌ (హెచ్‌డీఎల్‌) లేదా మంచి కొలెస్టరాల్‌ గుండెజబ్బులు, పోటు నుంచి రక్షణ కల్పిస్తుంది. అధికాదాయ దేశాల్లో హెచ్‌ డీఎల్‌ కొలెస్టరాల్‌ కాకుండా ఇతర రకాల కొలెస్టరాల్‌ మో తాదు క్రమేపీ తగ్గుతుండగా.. అల్ప, మధ్య ఆదా య దేశాల్లో ఎక్కువ అవుతోందని ఈ కొత్త అధ్యయనం చెబుతోంది. 1980 ప్రాంతం లో పాశ్చాత్య దేశాల్లో హెచ్‌ డీఎల్‌యేతర కొలెస్టరాల్‌ అత్యధికంగా ఉండగా, తొలిసారి ఇతర దేశాల్లో ఆ పరిస్థితి నమోదవు తోందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ మాజి ద్‌ ఎజ్జాటి తెలిపారు. చెడు కొలెస్టరాల్‌ విషయంలో భారత్‌ ప్రపంచదే శాల జాబితాలో 128వ స్థానంలో గత 39 ఏళ్లుగా కొనసాగుతోందని లక్ష్మయ్య తెలిపా రు. అయితే మహిళల విషయంలో మాత్రం ఒక ర్యాంకు పెరిగి 140కి చేరిందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top