కేసీఆర్ ను కలిసిన నందీశ్వర్ గౌడ్ | Nandheeswar Goud meets kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ ను కలిసిన నందీశ్వర్ గౌడ్

Mar 15 2014 11:14 AM | Updated on Aug 15 2018 9:17 PM

కేసీఆర్ ను కలిసిన నందీశ్వర్ గౌడ్ - Sakshi

కేసీఆర్ ను కలిసిన నందీశ్వర్ గౌడ్

కాంగ్రెస్ శాసనసభ్యుడు నందీశ్వర్‌గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

 హైదరాబాద్: పటాన్‌చెరు  కాంగ్రెస్ శాసనసభ్యుడు నందీశ్వర్‌గౌడ్ శనివారం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కలిశారు.  తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు నందీశ్వర్ గౌడ్ కేసీఆర్ తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అలాగే టీఆర్‌ఎస్ లో చేరికపై ఆయన తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. కాగా పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు ప్రధాన అనుచరుడు.

స్థానికంగా కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదని,  పార్టీ తరఫున పోటీ చేస్తే గెలిచే అవకాశాల్లేవనే ఉద్దేశంతోనే ఆయన టీఆర్‌ఎస్ వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ సమాచారం తెలిసి డీఎస్ ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. డీఎస్ స్వయంగా ఫోన్ చేసినా రెండ్రోజుల నుంచి స్పందించడం లేదని సమాచారం. అయితే డీఎస్ సన్నిహితులు మాత్రం నందీశ్వర్‌గౌడ్‌కు తాత్కాలిక ఇబ్బందులున్నప్పటికీ ఆయన మాత్రం కాంగ్రెస్‌ను వీడబోరనే చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement