ముదిరాజ్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

MLA Rasamayi Balakrishna Development Works Karimnagar - Sakshi

అల్గునూర్‌: ముదిరాజ్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉ న్నానని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణ కాలనీ పంచాయతీ పరిధిలోని సుభాష్‌నగర్‌లో మండల ముదిరాజ్‌ సంఘం ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రా మకృష్ణకాలనీ పంచాయతీ పరిధిలోని ఊరచెరువు అభివృద్ధిచేయాలని ముదిరాజ్‌లు కోరుతన్నారని తెలిపారు. ఈ విషయమై చెరువు అభివృద్ధికి మిషన్‌కాకతీయ పథంలో అభివృద్ధికి మంత్రి హరీశ్‌రావుకు ప్రతిపాదనలు కూడా పంపించామని తెలిపా రు. త్వరలోనే చెరువలో పూడితతీత చేపడతామని  ముదిరాజ్‌లు చేపలు పెంచుకుని ఉపాధిపొందేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ము దిరాజ్‌కు ఎల్‌ఎండీపైనే ఆధారపడ్డారని చెరువు అభివృద్ధితో గ్రామంలోని సంఘంసభ్యులు చేప లు పెంచుకుని ఉపాధిపొందాలని సూచించారు.

ముదిరాజ్‌ల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా చేపపిల్లలు కూడా పంపిణీ చేస్తోందన్నారు. రామకృష్ణకాలనీలోని పెద్దమ ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి సొంత నిధులు మం జూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముదిరాజ్‌ క మ్యూనిటీ భవన నిర్మాణానికి కూడా త్వరలో ని ధులు మంజూరుచేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను ముదిరాజ్‌ సంఘం నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో ఇందిరానగర్‌ స ర్పంచ్‌ మెంగని రమేశ్, నుస్తులాపూర్‌ సింగిల్‌విం డో చైర్మన్‌ గుజ్జుల రవీందర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ ప్ర ణీత్‌రెడ్డి, వార్డుసభ్యుడు దావు సంపత్‌రెడ్డి, ముదిరాజ్‌ నాయకులు సిద్ద దాసు, భూమయ్య, పండు గ రాజు, కొమురయ్య, చంద్రయ్య, నాయకులు సుగుర్తి జగదీశ్వరాచారి, నాగేందర్, పాల్గొన్నారు.
 
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
గన్నేరువరం: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్వేయ మని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. మండలంలోని గోపాల్‌పూర్‌లో హన్మాజిపల్లె గ్రా మానికి చెందిన రజితకు రూ.10 వేలు, మైలారం గ్రామానికి చెందిన సంతోష్‌కు రూ. 6వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను శుక్రవారం వారికి అందించారు. అనంతరం గ్రామానికి చెందిన, రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్‌ ఆకుల సంతోశ్‌ తండ్రి ఆకుల నర్సయ్య ఇటీవల మృతిచెందగా వారి కు టుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామం లోని సమస్యలపై గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు. సీసీ రోడ్లు వేయాలని గ్రామస్తులు కోరా రు. రైతు బంధు పథకంలో చెక్కులను మరికొంత మంది రైతులకు రాలేదని వాటిని ఇప్పించాలని రై తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు.

రైతుల సంక్షేమానికై రైతు బంధు, రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అర్హులైన వారందరికి ఈ పథకాన్ని వర్తింపజేయడం తమ లక్ష్యమన్నా రు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రా వు, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ గూడెల్లి తిరుపతి, మండల కోఆర్డినేటర్‌ బోడ మాధవరెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ న్యాత సుధాకర్, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా డైరెక్టర్‌ గొల్లపల్లి, సర్పంచు గువ్వ వీరయ్య, యూత్, బీసీ సెల్‌ మండల అధ్యక్షులు బొడ్డు సునిల్, అటికం రవి, ఉపాధ్యక్షుడు చింతలపల్లి నర్సింహరెడ్డి, కొర్వి తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షుడు తాళ్ళపల్లి అనిల్‌గౌడ్, తాళ్ళపల్లి శ్రీనివాస్‌గౌడ్, నూనే చంద్రారెడ్డి, పుల్లెల నరేందర్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top