
ఫలించిన కాంగ్రెస్ నేతల రాయబారం
కాంగ్రెస్ నేతల రాయబారం ఫలించింది. పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్...కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ నేతల రాయబారం ఫలించింది. పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్...కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి కూడా ఆయనకు ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. స్థానికంగా కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదని, పార్టీ తరఫున పోటీ చేస్తే గెలిచే అవకాశాల్లేవనే ఉద్దేశంతోనే నందీశ్వర్ గౌడ్ టీఆర్‌ఎస్ వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను కూడా కలిశారు.
అయితే నందీశ్వర్ గౌడ్ పార్టీ వీడేందుకు సిద్ధం కావటంతో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఆయన్ని బుజ్జగించేందుకు యత్నించారు. చివరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ పీసీసీ నేత డీ శ్రీనివాస్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ...రంగంలోకి దిగి నందీశ్వర్ గౌడ్ను బుజ్జగించి టీఆర్ఎస్లోకి వెళ్లే ఆలోచనను విరమింపచేశారు. నేతల రాయబారం ఫలించటంతో నందీశ్వర్ హస్తాన్ని వీడే యోచన విరమించుకున్నారు.