'నన్ను ఓడించేందుకు రూ.20 కోట్లు ఖర్చుచేశారు' | minister tummala nageswarrao reveals some facts | Sakshi
Sakshi News home page

'నన్ను ఓడించేందుకు రూ.20 కోట్లు ఖర్చుచేశారు'

Jun 2 2015 8:08 PM | Updated on Aug 29 2018 6:26 PM

'నన్ను ఓడించేందుకు రూ.20 కోట్లు ఖర్చుచేశారు' - Sakshi

'నన్ను ఓడించేందుకు రూ.20 కోట్లు ఖర్చుచేశారు'

ఎమ్మెల్యే కోటా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించడానికి కుట్రలు జరిగాయని రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

ఖమ్మం: ఎమ్మెల్యే కోటా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించడానికి కుట్రలు జరిగాయని రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మంగ ళవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తనను ఎలాగైనా ఓడించేందుకు కొందరు ఎమ్మెల్యేలకు రూ.20 కోట్ల వరకు ఎరవేశారన్నారు. కానీ వారి ప్రలోభాలకు తమ ఎమ్మెల్యేలు లొంగలేదని తెలిపారు.

ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ అధినేత మాట జవదాటకుండా అయిదు గురు సభ్యులను గెలిపించుకున్నారన్నారు. తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో తాను ఎమ్మెల్సీగా గెలుపొందానన్నారు. కేసీఆర్ తనపై నమ్మకం ఉంచి మంత్రి పదవి ఇచ్చారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement