సిరిసిల్లలో కేటీఆర్‌ పర్యటన | Minister KTR Visits Rajanna Sircilla | Sakshi
Sakshi News home page

సిరిసిల్లలో కేటీఆర్‌ పర్యటన

Aug 22 2017 4:08 PM | Updated on Aug 30 2019 8:24 PM

మంత్రి కేటీఆర్‌ మంగళవారం రాజన్న సిరిసల్ల జిల్లాలో పర్యటించారు.

రాజన్న సిరిసిల్ల: తెలంగాణాలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాను అగ్రభాగాన నిలిపేందుకే పట్టణ ఏరియా ఆసుపత్రిలో రూ. యాభై కోట్ల వ్యయంతో బ్లడ్ బ్యాంక్, డయాలసిస్ సెంటర్‌, పది పడకలతో ఐసీయూలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మంత్రి కేటీఆర్‌ మంగళవారం సిరిసల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందేందుకే ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రిల చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా నలభై సెంటర్లలో వెయ్యి డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
 
సిరిసిల్ల విద్యార్థినిల భవిష్యత్తుకై రూ. 36.5 కోట్లతో నర్సింగ్ కళాశాల, అలాగే రూ.13 కోట్లతో 50 పడకల మాతా శిశు సంక్షేమ కేంద్రానికి శంకుస్థాపన చేసుకున్నామని,  వచ్చే సంవత్సరం నుంచి వీటిని ప్రారంభిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రిల ప్రత్యేక చొరవతోనే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. తెలంగాణా ఆడపడుచులకు ఇస్తున్న పావలా వడ్డీ రుణాలలో భాగంగా రూ.12 కోట్ల చెక్కును మంత్రి కేటీఆర్‌ అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement