గద్వాలలో అదృశ్యం.. ఆగ్రాలో ప్రత్యక్షం | Sakshi
Sakshi News home page

గద్వాలలో అదృశ్యం.. ఆగ్రాలో ప్రత్యక్షం

Published Mon, Mar 16 2020 7:55 AM

Mentally Disabled Women Found In Agra - Sakshi

సాక్షి, గద్వాల క్రైం: మూడు నెలల క్రితం మతిస్థిమితం కోల్పోయి అదృశ్యమైన ఓ మహిళ గద్వాలలో అదృశ్యమై.. ఆగ్రాలో ప్రత్యక్షమైంది. వివరాల్లోకి వెళ్తే.. గద్వాలలోని క్రిష్ణరెడ్డి బంగ్లాకు చెందిన పుట్ట లక్ష్మి అనే మహిళ మతిస్థిమితం కోల్పోయి గత మూడు నెలల కిందట అదృశ్యమైంది. అయితే సదరు మహిళ ఆదివారం ఆగ్రా పోలీసుల వద్దకు చేరింది. అక్కడి పోలీసులు అమెను గుర్తించి వివరాలు తీసుకుని గద్వాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గద్వాలలోని లక్ష్మి భర్త ఆదినారాయణ, కుటంబ సభ్యులకు ఆమె ఫొటో చూపించగా గుర్తు పట్టారు. అయితే భార్య మతిస్థిమితం కోల్పోయి గతంలోనూ ఇలా వెళ్లినట్లు తెలిపారు. దీంతో ఆగ్రా, గద్వాల పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అమెను తీసుకురావడానికి వారి కుటుంబ సభ్యులు ఆగ్రాకు బయలు దేరారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement