పురుషులదే పైచేయి! 

Men Have The Upper Hand In The Voters, Mahabubnagar - Sakshi

 నవాబుపేట మండలంలో అదనంగా ఆరు పోలింగ్‌ కేంద్రాలు 

  నియోజకవర్గం మొదటి కేంద్రం ఇక్కడే 

 త్తం ఓటర్లు 33,200 మంది

 గతంలో కంటే 3 వేల మంది తగ్గిన ఓటర్ల సంఖ్య 

సాక్షి, నవాబుపేట: మండలంలో నవాబులదే పైచేయి. మండల ఓటర్ల సంఖ్యలో మహిళల కంటే పురుషులే అధికంగా ఉన్నారు. మండలంలోని మొత్తం 46 పోలింగ్‌ కేంద్రాల్లో 33,200 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 16,963 మంది పురుషులు, 16,232 మంది మహిళలున్నారు. 731 మంది ఓటర్లు అధికంగా ఉండటం విశేషం. కాగా గతంలో 40 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా తాజాగా మరో 6 కేంద్రాలు నవాబుపేట, చౌడూర్, అమ్మాపూర్, కారుకొండ గ్రామాల్లో అదనంగా ఏర్పాటు చేశారు.

 ఖానాపూర్‌ పోలింగ్‌ కేంద్రం జడ్చర్ల మండలంలో చేరడంతో మండలంలో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 45కు చేరింది. గత ఎన్నికల్లో మండలంలో 40 పోలింగ్‌ కేంద్రాల్లో 36,487 మంది ఓటర్లు ఉండగా.. ఈసారి దాదాపు 3 వేల మంది ఓటర్లు తగ్గడం విశేషం. అలాగే నియోజకవర్గం మొట్టమొదటి పోలింగ్‌ కేంద్రం మండలం నుంచే ప్రారంభం కావడం గమనార్హం. పోలింగ్‌ కేంద్రాలు మొత్తం ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లోనే ఏర్పాటు చేశారు. దీంతో ఆయా కేంద్రాలకు అన్ని వసతులపై ఇప్పటికే మండల అధికారుల బృందం పరిశీలన చేసింది. ఇక వికలాంగులు, దివ్యాంగులు ప్రత్యేకంగా ఓటు వేసేందుకు అనువైన పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేశారు.  

గ్రామాల వారీగా ఇలా.. 
మండలంలోని ఆయా గ్రామాల పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్లు ఇలా ఉన్నారు. కొల్లూరు ఒకటో పోలింగ్‌ కేంద్రంలో 1,245 మంది ఓటర్లు, రెండో కేంద్రంలో 975 మంది, మూడో కేంద్రంలో 700 మంది, పోమాల్‌ నాలుగో కేంద్రంలో 739 మంది, ఐదో కేంద్రంలో 489 మంది, ఆరో కేంద్రంలో 1,041 మంది, చౌడూర్‌ ఏడో కేంద్రంలో 651 మంది, ఎనిమిదో కేంద్రంలో 568 మంది, తొమ్మిదో కేంద్రంలో 449 మంది, దేపల్లి పదో కేంద్రంలో 608 మంది, కాకర్‌జాల్‌ 11వ కేంద్రంలో 752 మంది, లింగంపల్లి 12వ కేంద్రంలో 1,009 మంది, రేకులచౌడాపూర్‌ 13వ కేంద్రంలో 808 మంది, లోకిరేవు 14వ కేంద్రంలో 1,043 మంది, అమ్మాపూర్‌లో 15వ కేంద్రంలో 732 మంది, 16వ కేంద్రంలో 602 మంది, కామారం 17వ కేంద్రంలో 851 మంది, గురుకుంట 18వ కేంద్రంలో 746 మంది, 19వ కేంద్రంలో 1,073 మంది, నవాబుపేట 20వ కేంద్రంలో 813 మంది, 21వ కేంద్రంలో 491 మంది, 22వ కేంద్రంలో 519 మంది, 23వ కేంద్రంలో 502 మంది, 24వ కేంద్రంలో 547 మంది, యన్మన్‌గండ్ల 25వ కేంద్రంలో 930 మంది, 26వ కేంద్రంలో 838 మంది, కొండాపూర్‌ 27వ కేంద్రంలో 619 మంది, 28వ కేంద్రంలో 709 మంది, హజిలాపూర్‌ 29వ కేంద్రంలో 789 మంది, రుద్రారం  30వ కేంద్రంలో 768 మంది, 31వ కేంద్రంలో 498 మంది, కాకర్లపహాడ్‌ 32వ కేంద్రంలో 854 మంది, 33వ కేంద్రంలో 743 మంది, తీగలపల్లి 34వ కేంద్రంలో 1,166 మంది, సిద్దోటం 35వ కేంద్రంలో 674 మంది, కారుకొండ 37వ కేంద్రంలో 639 మంది, 38వ కేంద్రంలో 504 మంది, 39వ కేంద్రంలో 538 మంది, హన్మసానిపల్లి 40వ కేంద్రంలో 457 మంది, కూచూర్‌ 41వ కేంద్రంలో 856, 42వ కేంద్రంలో 697 మంది, ఇప్పటూర్‌ 43వ కేంద్రంలో 641 మంది, 44వ కేంద్రంలో 488 మంది, 45వ కేంద్రంలో 964 మంది, కారూర్‌ 46వ పోలింగ్‌ కేంద్రంలో 857 మంది ఓటర్లున్నారు. 

తుది జాబితాలో చేరుస్తాం.. 
ఇటీవల ఇచ్చిన ఫారం–6 ఆన్‌లైన్‌లో నమోదు కొనసాగుతోంది. వీటిని ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం తుది జాబితాలో చేరుస్తాం. కాగా పోలింగ్‌ కేంద్రాల వారీగా వచ్చిన కొత్త ఓటర్ల నమోదును ఆయా గ్రామాల రెవెన్యూ అధికారులచే విచారణ జరిపించి వాటిని తుది జాబితాలో చేరుస్తాం. ఇప్పటి వరకు మండలంలో 780 మంది కొత్తగా నమోదు చేసుకున్నారు. 
     – రాజునాయక్, తహసీల్దార్, నవాబుపేట  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top