క్రైమ్ రేట్ తగ్గించేందుకు చర్యలు | Measures to reduce the crime rate | Sakshi
Sakshi News home page

క్రైమ్ రేట్ తగ్గించేందుకు చర్యలు

Mar 9 2015 11:50 PM | Updated on Aug 11 2018 8:45 PM

మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో క్రైమ్ రేటు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ సందీప్

 హుజూర్‌నగర్: మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో క్రైమ్ రేటు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ సందీప్ గోనె తెలిపారు. సోమవారం స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును విచారించేందుకు వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గడిచిన ఏడాది కంటే ఈ ఏడాది ఇప్పటి వరకు క్రైమ్ రేటు బాగా తగ్గిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలీస్‌స్టేషన్లలో పేపర్‌లెస్ పరిపాలన పద్ధతి ఈనెల 5 నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పద్ధతి ద్వారా ఫిర్యాదులు, ఎఫ్‌ఐఆర్‌లు, పరిపాలన ఆన్‌లైన్‌లోనే కొనసాగుతుందన్నారు. ఇప్పటికే ప్రతిస్టేషన్ నుంచి ఇద్దరు సిబ్బం ది,ఎస్‌ఐలకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.  సమావేశంలో సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు అఖిల్‌జామా, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement