మామిడిచెట్టుకు పెళ్లి | Mango tree to get married | Sakshi
Sakshi News home page

మామిడిచెట్టుకు పెళ్లి

Feb 25 2016 2:56 AM | Updated on Oct 9 2018 4:55 PM

మామిడిచెట్టుకు పెళ్లి - Sakshi

మామిడిచెట్టుకు పెళ్లి

పురుషునితో మహిళకు పెళ్లి జరుగుతుందని అందరికీ తెలుసు. కానీ, మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాపూర్‌లో మామిడి చెట్టు..

తూప్రాన్: పురుషునితో మహిళకు పెళ్లి జరుగుతుందని అందరికీ తెలుసు. కానీ, మెదక్ జిల్లా తూ ప్రాన్ మండలం వెంకటాపూర్‌లో మామిడి చెట్టు.. మరో మామిడి మొక్క వివాహ బంధంతో బుధవారం ఒక్కటయ్యాయి. మామిడితోట నాటి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని యజమాని ఈ తంతు నిర్వహించారు. పెళ్లికి కుటుంబసభ్యులతో పాటు బంధుమిత్రులనూ ఆహ్వానించాడు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు బుచ్చిరెడ్డిగారి శ్రీకాంత్‌రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉపాధి హామీ పథకం కింద 2007-08లో 350 మామిడి మొక్కలను తన నాలుగు ఎకరాల పొలంలో నాటాడు. ప్రస్తుతం అవి మంచి దిగుబడిని ఇస్తున్నాయి. దీంతో ఆ రైతు తోట నాటి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మామిడితోటలో రెండు మామిడి చెట్లకు బ్రాహ్మణోత్తములతో వేదమంత్రాలు. బాజాభజంత్రీల మధ్య వైభవంగా వివాహం జరిపించాడు. పెద్ద మామిడిచెట్టుకు చిన్న మామిడి మొక్కనిచ్చి పెళ్లి జరిపించిన విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement