రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.
నర్సంపేట (వరంగల్) : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల కేంద్రం శివారులో బైక్‌పై వెళుతున్న వ్యక్తిని వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మండలంలోని దాసరిపల్లి గ్రామానికి చెందిన నాగరాజు(25)గా పోలీసులు గుర్తించారు.