
సాక్షి, హైదరాబాద్: ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) మేథమెటిక్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు టీజీటీ ఇతర సబ్జెక్టు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నా, టీఆర్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నా, వాటిని వదులుకోవాలని టీఎస్‌పీఎస్సీ విజ్ఞప్తి చేసింది.
తద్వారా ఆయా పోస్టుల్లో ఆ తరువాత మెరిట్‌లో ఉండే వారిని ఎంపిక చేయవచ్చని పేర్కొంది. టీజీటీ మ్యాథ్స్ పోస్టులకు ఎంపికైన వారు తమ వెబ్‌సైట్‌లోని లింకు ద్వారా 30వ తేదీన మిగతా పోస్టులను వదులుకునేందుకు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని సూచించింది.