కూరెళ్లకు దాశరథి పురస్కారం | Kurella Vittalacharya Gets Dasarathi Award | Sakshi
Sakshi News home page

కూరెళ్లకు దాశరథి పురస్కారం

Jul 19 2019 8:41 AM | Updated on Jul 19 2019 8:41 AM

Kurella Vittalacharya Gets Dasarathi Award - Sakshi

డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య 

రామన్నపేట : ప్రముఖ సాహితీవేత్త, రచయిత డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్యను దాశరథి పురస్కారం వరించింది. జూలై 22న దాశరథి కృష్ణమాచార్యులు జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం దాశరథి పురస్కారాన్ని అందజేస్తోంది. 2019 సంవత్సరానికిగాను ప్రభుత్వం కూరెళ్లను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన కూరెళ్ల లక్ష్మమ్మ–వెంకటరాజయ్యల కుమారుడు కూరెళ్ల విఠలాచార్య. ఆయన ఏడవ తరగతి నుంచే తన రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించారు. కూరెళ్ల రాసిన 18కి పైగా గ్రంథాలు ఇప్పటివరకు ముద్రితమయ్యాయి. ఆయన సాహితీరంగానికే పరిమితంకాక జిల్లా వ్యాప్తంగా పలు సాంస్కృతిక సంస్థలు, యువజన సంఘాలను నెలకొల్పి సామాజిక సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. ఆయనకు మధురకవి, అభినవ పోతన, తెలంగాణ వేమన, నల్లగొండ కాళోజీ తదితర బిరుదులు ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement