ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

KTR Birthday Celebrations as solid - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కె.తారకరామారావు 42వ జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్‌ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించాయి. తెలంగాణభవన్‌లో శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్, చీఫ్‌ విప్‌ పాతూరి సుధా కర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తదితరులు కేక్‌ కట్‌ చేశారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, రాములు నాయక్,  నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, అటవీ అభి వృద్ధి సంస్థ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి తది తరులు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌వీ నాయకు డు పల్లా ప్రవీణ్‌రెడ్డి నేతృత్వంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా జీహెచ్‌ఎంసీ హరితహారానికి పిలుపునిచ్చింది. కేటీఆర్‌ జన్మరాశి ప్రకారం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మేయర్‌ రామ్మోహన్‌ బంజారాహిల్స్‌లోని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కళాశాలలో 42 జిట్రేగు మొక్కలను నాటారు. జూబ్లీహిల్స్‌ స్టేట్‌ హోమ్‌లో టీఆర్‌ఎస్‌ సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తదితరులు మొక్కలు నాటారు. 

వెల్లువెత్తిన అభిమానం..: మంత్రి కేటీఆర్‌కు  ట్విట్టర్‌లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాజకీయ, అధికార, సినీ, పారిశ్రామిక తదితర రంగాల ప్రముఖులు ట్విట్టర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంతో పాటు ఏపీ, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని కేటీఆర్‌ అభిమానులు సైతం జన్మదిన శుభాకాం క్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిషన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్, భారత్‌లోని ఇజ్రాయిల్‌ దౌత్య వేత్త డేనియల్‌ కార్మన్, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఉమర్‌ అబ్దు ల్లా, గోవా ఐటీ మంత్రి రోహన్‌ ఖాంటే, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, పద్మారావు, లక్ష్మారెడ్డి, ఎంపీలు బాల్క సుమన్, బీబీ పాటిల్, విపక్ష నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

మా అన్నయ్య సూపర్‌ హీరో: కవిత 
‘హ్యాపీ బర్త్‌ డే అన్నయ్యా.. సూపర్‌ హీరోలుండరని ఎవరైనా అనుకుంటే, వారికి నీ గురించి తెలుసుకోమని చెబుతాను’అని కేటీఆర్‌ సోదరి, ఎంపీ కవిత ట్వీట్‌ చేశారు. అలాగే సినీనటులు మహేశ్‌బాబు, రామ్‌చరణ్, నాని, మంచు విష్ణు, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, బాలివుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ దర్శకులు వంశీ పైడిపల్లి, మెహెర్‌ రమేశ్, కోన వెంకట్, హరీశ్‌ శంకర్, గోపిచంద్‌ మలినేని సైతం ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు

గోదావరిఖని: మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను వినూత్న తరహాలో నిర్వహించి వండర్‌ బుక్‌ఆఫ్‌ రికార్డులో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత కోరుకంటి చందర్‌ చోటు సాధించారు. కేటీఆర్‌ 42వ జన్మదినం సందర్భంగా గోదావరిఖని ఆర్‌కే గార్డెన్‌లో మంగళవారం 42 కిలోల కేక్‌తో 42 మంది కళాకారులు, 42 మంది తెలంగాణ ఉద్యమ కారులు, 42 మంది కేటీఆర్‌ వేషధారణ, 42 మహిళా సంఘాలు, 42 మొక్కలు నాటి, 42 నిమిషాలపాటు కార్యక్రమాన్ని నిర్వహించి వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించాడు. వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ ప్రతినిధులు నరేందర్‌గౌడ్, వేణుగోపాల్‌ కోరుకంటి చందర్‌కు రికార్డు పత్రాలను అందజేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top