కోదండరాంకు తప్పిన ప్రమాదం | Kodandaram escapes unhurt in road accident | Sakshi
Sakshi News home page

కోదండరాంకు తప్పిన ప్రమాదం

Feb 12 2018 12:49 AM | Updated on Jul 29 2019 2:51 PM

Kodandaram escapes unhurt in road accident - Sakshi

ప్రమాదానికి గురైన కారు, కోదండరామ్‌(ఇన్‌సెట్‌లో)

నల్లగొండ రూరల్‌/చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం కోదండరాంకు తృటిలో ప్రమాదం తప్పింది. జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఇన్నోవా వాహనంలో హైదరాబాద్‌కు బయలుదేరారు.

వెలిమినేడు గ్రామ శివారు పిట్టంపల్లి క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే రోడ్డు దాటుతున్న బైక్‌ను ఇన్నోవా ఢీకొట్టి డివైడర్‌ను ఎక్కి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో కోదండరాంకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరో వాహనంలో ఆయన హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన లడే మహేశ్, చిల్లూరి మధుకు గాయాలయ్యాయి. 

Advertisement
 
Advertisement
Advertisement