మోదీయే మా నినాదం! | Sakshi
Sakshi News home page

మోదీయే మా నినాదం!

Published Thu, Jan 17 2019 3:05 AM

KCR N Chandrababu Naidu are wasting time for front - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మరోసారి మోదీ సర్కార్‌’నినాదంతోనే పార్లమెంటు ఎన్నికలకు వెళ్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసం మోదీకే మరోసారి ప్రధానిపీఠం అప్పజెప్పాలని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారన్నారు. కేసీఆర్‌ ఎక్కువ సీట్లు గెలిచి కేంద్రంలో చేసేదేమీ ఉండదన్నారు. బుధవారంపార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓట్లేసే పరి స్థితి లేదన్నారు. ప్రాంతీయపార్టీల పేరుతో కుటుంబ పార్టీల న్నీ ఏకమయ్యాయని.. కుటుంబ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలు పణంగా పెడుతున్నాయని లక్ష్మణ్‌ విమర్శించారు.

‘ఇద్దరు చంద్రులు వేర్వేరు ఫ్రంట్‌ల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు విఫలం కావడం ఖాయం. కుటుంబ పార్టీలన్నీ కలసి తమ ఉనికి చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రమే. జాతీయ పార్టీ లేని కూటములు ఎన్నికట్టినా అది విఫలమవుతుంది’అని ఆయన పేర్కొన్నారు. ఈ నెలాఖర్లో అమిత్‌ షా, మార్చిలో ప్రధాని తెలంగాణకు వస్తున్నారని లక్ష్మణ్‌ తెలిపారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఉం టాయన్నారు. ‘సర్జికల్‌ స్ట్రైక్‌ జరిగితే ఆధారాలు అడిగిన పార్టీలకు ఓటు అడిగే హక్కు ఉందా? కశ్మీర్‌ అస్తిత్వాన్ని ప్రశ్నించిన టీఆర్‌ఎస్‌ దేశహితం ఆలోచి స్తుందా? ప్రజలు ఆలోచించాలి’అని లక్ష్మణ్‌ కోరారు.

కూటముల పీఎం అభ్యర్థులెవరు?
కూటములు, ఫ్రంట్‌లు తమ ప్రధాని అభ్యర్థి ఎవరో తేల్చుకోలేకపోతున్నాయని విమర్శించారు. ‘గాంధీ అన్న పేరుండటమే తన అర్హతగా ప్రధాని కావాలని రా>హుల్‌ కలగంటున్నారు. మోదీకి, రాహుల్‌ మధ్య నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ దేశాన్ని ఎలా దోచుకుందో ప్రజలు గమనిస్తున్నారు. ఆ పార్టీ నేతలు దోచుకొని విదేశాల్లో దాచుకున్న ధనాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు మోదీ చేస్తున్న కృషిని, ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారు’ అని అన్నారు.  

Advertisement
Advertisement