అభివృద్ధిలో రాజీపడలే.. | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో రాజీపడలే..

Published Tue, Oct 9 2018 6:51 AM

Kamma Is Development District Says Thummala Nageswara Rao - Sakshi

గుండాల (ఖమ్మం): కనీసం రోడ్డు సౌకర్యం లేని గుండాల ప్రాంతం అభివృద్ధికి 30 ఏళ్ల క్రితమే బాటలు వేశానని, నేటి వరకు మంత్రిగా అనేక పనులు చేయించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపా రు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించిన ఆయన గుండాలలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. రోడ్లు, చెరువులు, నిర్మించామని, సబ్‌ స్టేషన్‌ పూర్తి చేశామని, ఉమ్మడి రాష్ట్రంలోనే తన ఇన్నేళ్ల పాలనలో తుమ్మలను గుర్తుపెట్టుకున్న మండలం గుండాల అని ఆనందం వ్యక్తం చేశారు. గుండాల– ఇల్లెందు, చె ట్టుపల్లి, సాయనపల్లికి రోడ్లు వేయించానన్నారు. ఇటీవల టీఆర్‌ఎస్‌ పాలనలో రూ.300 కోట్లు మం జూరు చేయించామని వెల్లడించారు. గ్రామాల మధ్య లింకు రోడ్లు, 14 చోట్ల వాగులపై బ్రిడ్జిల నిర్మాణాలు సాగుతున్నాయని అయినా కాంగ్రెస్‌ నాయకులు అభివృద్ధి శూన్యమని చెప్పడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో మిషన్‌ కాకతీ య, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణ లక్ష్మి, ఆస రా పింఛన్లు 24 గంటల కరెంటు సరపరా పథకాలతో ప్రజలందరికీ లబ్ధి చేకూరుతోందని వివరించారు. 

పాయంను ఆదరించండి : ఎంపీ సీతారాంనాయక్‌ 
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆళ్లపల్లి, గుండాల మండలాలను అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నారని, మళ్లీ ఆయ నను ఆదరించి, గెలిపించుకోవాలని ఎంపీ సీతా రాం నాయక్‌ అన్నారు. గత 60ఏళ్లు పాలనలో ఉ న్న కాంగ్రెస్‌ పాలకులు చేయలేని పథకాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేక దుర్మార్గపు మాటలు జారు తున్నారని ఆరోపించారు. రానున్నది టీఆర్‌ఎస్‌ పాలననేని, కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖా యమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలంతా పాయం వెన్నంటే ఉంటూ అహర్నిషలు కష్టపడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ చాట్ల పద్మ, జిల్లా నాయకులు భవానీశంకర్, పేరయ్య, సత్య నారాయణ, పైడి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్ష, కార్యదర్శులు తెల్లం బాస్కర్, ఎస్‌కె.ఖదీర్, టీ.రాము, ముకుందాచారి, బచ్చల రామయ్య, రషీద్, కుంజ బుచ్చయ్య, బాటయ్య, బుచ్చయ్య, గణేష్, లలిత, నిర్మల, లక్ష్మీనారాయణ, ముఖేష్, దారా అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement