ముఖర్జీ మార్గమే బీజేపీకి స్ఫూర్తి: లక్ష్మణ్‌ | k laxman praises Syama Prasad Mukherjee services | Sakshi
Sakshi News home page

ముఖర్జీ మార్గమే బీజేపీకి స్ఫూర్తి: లక్ష్మణ్‌

Jul 6 2017 12:27 PM | Updated on Sep 5 2017 3:22 PM

ముఖర్జీ మార్గమే బీజేపీకి స్ఫూర్తి: లక్ష్మణ్‌

ముఖర్జీ మార్గమే బీజేపీకి స్ఫూర్తి: లక్ష్మణ్‌

నేటి తరం నేతలు, కార్యకర్తలకు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ జీవితం ఆదర్శప్రాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు.

హైదరాబాద్‌: నేటి తరం నేతలు, కార్యకర్తలకు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ జీవితం ఆదర్శప్రాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. బీజేపీ సిద్ధాంతకర్త, జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముఖర్జీ మార్గమే బీజేపీకి స్ఫూర్తి. ఒకే దేశంలో రెండు జెండాలు, రెండు విధానాలు చెల్లవని చెప్పిన గొప్ప దార్శనికుడు ముఖర్జీ అని పేర్కొన్నారు. ఆనాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంపై ఆయనతో ముఖర్జీ విభేదించారు.

దేశం కోసం ఆయన చేసిన త్యాగాల వల్ల జమ్మూకు ఉన్నటువంటి ప్రత్యేక గుర్తింపు రద్దు చేసి భారత రాజ్యాంగంలో కలిసేలా చేశారని గుర్తుచేశారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ను కూడా తప్పుపట్టే విధంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడటం నిజంగా సిగ్గుచేటని.. దేశంపై వారికున్న చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు కనపడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్‌తో పాటు కిషన్‌రెడ్డి, రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement