దినేశ్.. ప్రచారం జోష్ | Josh Dinesh Campaign | Sakshi
Sakshi News home page

దినేశ్.. ప్రచారం జోష్

Apr 18 2014 3:36 AM | Updated on Aug 29 2018 8:56 PM

దినేశ్..  ప్రచారం జోష్ - Sakshi

దినేశ్.. ప్రచారం జోష్

మొన్నటివరకు డీజీపీగా పనిచేసి..ప్రస్తుతం వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ నుంచి పోటీచేస్తున్న దినేశ్‌రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

  •   విస్తృతంగా పర్యటిస్తున్న మాజీ పోలీస్ బాస్
  •   అన్నివర్గాలను కలుపుకపోతున్న లోక్‌సభ అభ్యర్థి
  •   ర్యాలీలు,పార్టీలో చేరికలతో వైఎస్సార్‌సీపీలో నూతనోత్సాహం
  •  నాచారం,మౌలాలి,న్యూస్‌లైన్: మొన్నటివరకు డీజీపీగా పనిచేసి..ప్రస్తుతం వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ నుంచి పోటీచేస్తున్న దినేశ్‌రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రచారంలో ముందుకుసాగుతున్నారు.

    ఇందులోభాగంగా గురువారం నాచారంలో జరిగిన భారీర్యాలీలో దినేశ్‌రెడ్డి పాల్గొనగా.. నాచారానికి చెందిన వీఎస్ ప్రకాష్‌రెడ్డి పార్టీలో చేరారు. నాచారం సావర్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వేర్వేరు కార్యక్రమాల్లో దినేశ్‌రెడ్డి మాట్లాడుతూ..దివంగత మహానేత రాజశేఖరరెడ్డి ప్రవైశపెట్టిన సంక్షేమపథకాల అమలు జగన్‌తోనే సాధ్యమని స్పష్టంచేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. ఉప్పల్ చిలుకానగర్‌లో అనసూయారెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు.
     
    ముస్లింలకు అండగా ఉంటాం..: ముస్లింలకు తమ పార్టీ ఎప్పుడూ అండగానే ఉంటుందని దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. మౌలాలిలో జరిగిన ప్రచారంలో తొలుత మౌలాలి హజ్రత్‌అలి గుట్టకు చేరుకుని చిల్లావద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బస్తీలో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్ ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తుచేశారు. అనంతరం ఆయన స్థానిక ముస్లిం నేతలను కలిసి మద్దతివ్వాలని కోరారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement