ఇళ్ల కోసం బారులు

Jnnurm Scheme Online Application Problems In Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. బడుగుల సొంతిం టి కల సాకారమవుతోంది. జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం), రాజీవ్‌ గృహకల్ప, వాంబే పథకాల కింద జిల్లా యంత్రాంగం ఫ్లాట్‌లను కేటాయిస్తోంది. ఈ మేరకు ఇదివరకే దరఖాస్తు చేసుకున్నవారికి అవకాశం కల్పిస్తోంది. జిల్లావ్యాప్తంగా 12 చోట్ల నిర్మించిన కాలనీల్లోఖాళీగా ఉన్న 1900 ఫ్లాట్లను కేటాయించేందుకు దరఖాస్తుదారులను ఆహ్వానించింది. దీంతో శనివారం గడువు ముగిసే సమయానికి 1,366 మంది మొదటి విడతగా డిమాండ్‌ డ్రాఫ్ట్‌ రూపేణా రూ.45,011 చెల్లించారు.

డీడీలు చెల్లించేందుకు ఈ పథకాల కింద సుమారు 26వేల మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ తొలి వాయిదా కట్టడానికి ముందుకు రాలేదు. దీంతో డబ్బు చెల్లించినవారికి దాదాపుగా ఫ్లాట్‌ ఖాయమైనట్లే. అయితే, మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతితో బ్యాంకులకు సెలవు రావడంతో డీడీలు తీయలేకపోయామని పలువురు లబ్ధిదారులు వాపోయారు. ఫ్లాట్ల ఖాళీ ల నేపథ్యంలో వీరికి మరో అవకాశం కల్పించే అం శాన్ని జిల్లా యంత్రాంగం పరిశీలిస్తోంది. ఫ్లాట్ల ఖాళీల కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ పద్ధతిన కేటాయించి.. మిగతా వారికి డీడీలు వాపస్‌ ఇవ్వాలని యంత్రాంగం యోచిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top