నేడు జేఈఈ మెయిన్ | Sakshi
Sakshi News home page

నేడు జేఈఈ మెయిన్

Published Sat, Apr 4 2015 1:22 AM

JEE Main today


 సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ/ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్-2015 రాత పరీక్ష శనివారం జరగనుంది. ఈ పరీక్ష సందర్భంగా విద్యార్థులను అరగంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. పేపరు-1 పరీక్ష ఉదయం 9:30 గంటలకు, పేపరు-2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. నిర్ణీతసమయం తరువాత వచ్చే వారిని నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. తెలంగాణ నుంచి ఈ పరీక్షకు 70 వేల మందికిపైగా విద్యార్థులు హాజరుకానున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను సీబీఎస్‌ఈ ఏర్పాటు చేసింది.
 
 విద్యార్థులూ మరచిపోవద్దు..
 
 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ క్వాలిఫైయింగ్(ఇంటర్) పరీక్షలకు సంబంధించిన ఆధారం (డాక్యుమెంట్) మరిచిపోవద్దు. దానిని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి.
 2013, 2014ల్లోనే ఇంటర్ పాసైన వారైతే   మార్కుల షీట్ జిరాక్స్ కాపీని అందజేయాలి.
 2013, 2014ల్లోనే ఇంటర్మీడియట్ పాస్ అయినా ప్రస్తుతం అన్ని సబ్జెక్టుల్లో ఇంప్రూవ్‌మెంట్ రాస్తున్న వారైతే ఇంప్రూవ్‌మెంట్‌కు సంబంధించిన హాల్‌టికెట్‌ను అందజేయాలి.
 ప్రస్తుతం (2015లో) ఇంటర్మీడియట్ పరీక్షలను మొదటిసారిగా రాస్తున్న వారైతే తమ హాల్‌టికె ట్‌ను అందజేయాలి.


 

Advertisement
Advertisement