మేమెంతో.. మాకంత ఇవ్వాల్సిందే

మేమెంతో.. మాకంత ఇవ్వాల్సిందే - Sakshi


బీసీల జనాభాకు తగినట్లు రిజర్వేషన్లు పెంచాలి

► ‘సాక్షి’తో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

► దామాషా పద్ధతిన రిజర్వేషన్లకు సుప్రీం ఎప్పుడో ఓకే చెప్పింది  

► పాలకులకు చిత్తశుద్ధి లేకనే అమలు కావడం లేదు

►  నేడు హైదరాబాద్‌లో ‘బీసీల సమర శంఖారావం’ సభ  




సాక్షి, నల్లగొండ: వెనుకబడిన కులాలకు (బీసీలకు) కూడా జనాభా దామాషా పద్ధతిన విద్య, ఉద్యో గాల్లో రిజర్వేషన్లు అమలు చేయా లని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఎంతశాతం మంది బీసీలు ఉన్నారో అంతశాతం రిజర్వేషన్‌ ఇవ్వాల్సిం దేనని స్పష్టం చేశారు.


బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని.. బీసీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని తీసుకురావాలని కోరా రు. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రధాన డిమాం డ్‌తో ఆదివారం హైదరాబాద్‌లో ‘బీసీల సమర శంఖారావం’ సభ జరుగ నుంది. ఈ నేపథ్యంలో జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..



సుప్రీంకోర్టు సూచించినా..

‘‘బీసీ కులాలకు జనాభా దామాషా పద్ధతిన రిజర్వే షన్లు పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. ఆయా కులాల జనా భాకు తగినట్టు విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రాతి నిధ్యం లభించని పక్షంలో.. ఈ రిజర్వేషన్లు వారిపై సామాజిక వివక్షను నిర్మూలిస్తాయని, పాలనలో బీసీ వర్గాల ప్రాతినిధ్యా న్ని పెంచేందుకు దోహదపడతాయనీ అభిప్రాయ పడింది. ఈ సూచనలను అమలు చేయడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.



జనాభా లెక్కలే ఆటంకం

బీసీ రిజర్వేషన్ల పెంపునకు జనాభా లెక్కలే ఆటం కంగా మారాయి. 1930 దశకంలో బ్రిటిష్‌ పాలకులు గణించిన తర్వాత ఇప్పటివరకూ బీసీల లెక్కలు తీయలేదు. 2011లో కులాల వారీగా దేశవ్యాప్త గణన చేసినా వాటిని అధికారికంగా బయటపెట్టడం లేదు. 2014లో తెలంగాణ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో చివరి నిమిషంలో కులం అంశాన్ని చేర్చి లెక్కలు తీశారు. కానీ ఆ లెక్కలను కూడా బయటపెట్టలేదు. దేశంలో జంతువులకు లెక్కలుం టాయి కానీ.. బీసీలకు లేకపోవడం దురదృష్టకరం.


అందువల్లే బీసీల రిజర్వేషన్ల పెంపు సాధ్యం కావడం లేదు. 1986లో బీసీల రిజర్వేషన్లు 44శాతానికి పెంచుతూ ఎన్టీఆర్‌ నిర్ణయం తీసుకున్నప్పుడు రిజరే ్వషన్‌ వ్యతిరేకులు కొందరు కోర్టుకెళ్లారు. అప్పుడు కూడా బీసీల జనాభా లెక్కలు లేవనే కోర్టు ఎన్టీఆర్‌ సర్కారు నిర్ణయాన్ని కొట్టివేసింది. శాస్త్రీయం గా లెక్కలు తీసుకుని బీసీల రిజర్వేషన్లు పెంచవ చ్చని సూచించింది. కానీ ఇప్పటివరకు రాష్ట్రంలో అలాంటి ప్రయత్నం జరగలేదు. బీసీలు, ఎంబీసీలు, సంచార జాతులకు సమాన ప్రాతినిధ్యం లేకపోవ డానికి కారణం కూడా ఇదే.



అరశాతం కూడా పెంచరా?

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలకు 10 శాతానికి, బీసీ–ఈలోని మైనార్టీలకు 12 శాతానికి రిజర్వేషన్లు పెంచింది. దానిపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ 54 శాతం జనాభా ఉన్న బీసీ ఏ, బీ, సీ, డీలకు అర శాతమైనా పెంచలేదు. బీసీ కమిషన్‌ వేసినప్పుడు తమిళనాడు తరహాలో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్‌ చెప్పడంతో సంబురపడ్డాం.


కానీ అలాంటి ప్రయత్నమేదీ జరగ డం లేదు. అందువల్ల మురళీధర్‌రావు, అనంతరా మన్, జస్టిస్‌ దాల్వ సుబ్రమణ్యం కమిషన్ల నివేదికల మేరకు జనాభా దామాషా పద్ధతిన బీసీ రిజర్వేషన్ల ను పెంచాలి. ఇందుకు ప్రస్తుత బీసీ కమిషన్‌ గడువును 3 నెలలకు కుదించాలి. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి చట్టం చేయాలి.



సబ్‌ప్లాన్‌కు చట్టం చేయాలి

సమర శంఖారావం సభలో బీసీలకు రిజర్వేషన్ల పెంపుతో పాటు పలు అంశాలనూ ప్రభుత్వం ముందు పెట్టబోతున్నాం. ఈ సభకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, బీసీ వర్గాలకు చెందిన విపక్ష పార్టీల అ«ధ్యక్షులూ వస్తున్నారు. చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపాలి. అఖిలపక్షంతో కేంద్రంపై ఒత్తిడి తేవాలి. బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లలో ప్రమోషన్లు ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నుంచి బీసీలను మినహాయించాలి. బీసీ సబ్‌ప్లాన్‌కు రూ.20వేల కోట్లు కేటాయించాలి. దీని అమలుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించి చట్టం రూపొందించాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top