5న ఫుడ్ సైన్స్ కోర్సు కౌన్సెలింగ్ | jayashankar agriculture university food science councelling on september 5 | Sakshi
Sakshi News home page

5న ఫుడ్ సైన్స్ కోర్సు కౌన్సెలింగ్

Sep 1 2015 9:12 AM | Updated on Jun 4 2019 5:16 PM

అగ్రికల్చర్ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాల కోసం ఈ నెల 5న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రవీణ్‌రావు తెలిపారు.

హైదరాబాద్: అగ్రికల్చర్ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాల కోసం ఈ నెల 5న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రవీణ్‌రావు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉదయం 10 గంటలకు వర్సిటీ ఆడిటోరియంలో హాజరు కావాలని సూచించారు.

నిజామాబాద్(రుద్రూరు) ఫుడ్ సైన్స్, టెక్నాలజీలో బైపీసీ అభ్యర్థులకు 20 సీట్లున్నాయని వీటిని రిజర్వేషన్ ప్రకారంగా నిబంధనల అనుసరించి భర్తీ చే పడుతామని రిజిస్ట్రార్ తెలిపారు. 1:4 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తున్నందున అందరికీ సీట్లు వస్తాయన్న గ్యారెంటీ లేదని వివరించారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థుల జా బితాను వర్సిటీ వెబ్‌సైట్ www.pjtsau.ac.inలో ఉంచినట్లు రిజిస్ట్రార్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement