మానసిక ఒత్తిడికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
షాద్‌నగర్ (మహబూబ్‌నగర్): మానసిక ఒత్తిడికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.... పట్టణంలోని తిరుమలకాలనీకి చెందిన మహేష్ (18) హైదరాబాద్, హయత్‌నగర్‌లోని ఎన్‌ఆర్‌ఐ కళశాలలో ఇంటర్మీడియెట్ చదివాడు.
రెండో సంవత్సరం గణితంలో ఫెయిల్ కావడంతో ప్రస్తుతం పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకున్నాడు. బుధవారం నుంచి పరీక్షలు మొదలవుతుండటంతో మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోయాడు. మంగళవారం మధ్యాహ్నం మేడపైకి వెళ్లి ఉరేసుకున్నాడు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ ఆదిత్య పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.