
కార్యకర్తల్లో అసహనం వాస్తవమే: బాలకృష్ణ
టీడీపీ, బీజేపీ పొత్తుపై కార్యకర్తలు అసహనంతో ఉన్న మాట వాస్తవమేనని నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.
టీడీపీ, బీజేపీ పొత్తుపై బాలకృష్ణ వ్యాఖ్య
యాదగిరికొండ, న్యూస్‌లైన్: టీడీపీ, బీజేపీ పొత్తుపై కార్యకర్తలు అసహనంతో ఉన్న మాట వాస్తవమేనని నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో విలేకరులతో మాట్లాడారు. అందరికీ సమన్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఎక్కడి నుంచి పోటీ చేసేది చెప్పేందుకు నిరాకరించారు.