రాత్రికి రాత్రే.. | illegal land occupation | Sakshi
Sakshi News home page

రాత్రికి రాత్రే..

Jun 27 2014 1:04 AM | Updated on Sep 17 2018 5:10 PM

రాత్రికి రాత్రే.. - Sakshi

రాత్రికి రాత్రే..

కలెక్టర్ అహ్మద్ బాబు గురువారం బదిలీ అయ్యారన్న సమాచారంతో ఆదిలాబాద్ పట్టణంలో ఆక్రమణదారులు విజృంభించారు.

ఆదిలాబాద్ : కలెక్టర్ అహ్మద్ బాబు గురువారం బదిలీ అయ్యారన్న సమాచారంతో ఆదిలాబాద్ పట్టణంలో ఆక్రమణదారులు విజృంభించారు. పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ గోడకు ఆనుకొని గురువారం రాత్రికి రాత్రే స్తంభాలు పాతి కబ్జాలకు దిగారు. దీంతో పాటు గర్ల్స్ హైస్కూల్ పక్కన రోడ్డుకు ఇరుైవైపుల దారిపొడవున ఆక్రమణలు వెలిశాయి. కాగాఐదు నెలల క్రితం కలెక్టర్ చొరవతో పట్టణంలోని ప్రధాన, అంతర్గత రోడ్లకు ఇరువైపుల కబ్జాలను తొలగించడం జరిగింది. అధికార పార్టికి చెందిన ఓ నేత ప్రమేయంతోనే పలువురు కబ్జాదారులు తిరిగి ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
 
రాజకీయ నాయకుల ప్రమేయంతోనే ఈ వ్యవహారం రాత్రికి రాత్రే జరిగిందని చర్చించుకుంటున్నారు. పట్టణంలో ఎన్నో ఏళ్లుగా రోడ్డును దర్జాగా ఆక్రమించి పలువురు షెల్టర్లు వేసి వ్యాపారాలు కొనసాగించారు. వాటిని అద్దెకిచ్చుకుంటూ లాభాలు పొందారు. ప్రధానంగా ఈ ఆక్రమణలో రాజకీయ నాయకుల పాత్ర ఉందన్న చర్చ జోరుగా సాగుతున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement