ఆస్పత్రి ఎదుట ఆందోళన | hospital doctors due to negligence of the person | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి ఎదుట ఆందోళన

Jan 21 2015 11:25 AM | Updated on Sep 2 2017 8:02 PM

వైద్యుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు

హైదరాబాద్:  వైద్యుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలు.. మెహిదీపట్నం నాలానగర్‌లోని ఆలివ్ ఆస్పత్రిలో బాలూనాయక్(22) అనే యువకుడికి పది రోజుల క్రితం గుండె ఆపరేషన్ చేశారు.  మంగళవారం రాత్రి అతనికి మళ్లీ గుండెనొప్పి రావటంతో ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించి చనిపోయాడు.

అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లనే అతడు చనిపోయాడంటూ బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగంప్రవేశం చేశారు. లాఠీచార్జి చేసి, పలువురిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement