నిర్మల్ జిల్లాలో ఇరిగేషన్ అధికారులపై తేనెటీగలు దాడి చేశాయి.
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో ఇరిగేషన్ అధికారులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ జిల్లాలోని ఘటన సారంగాపూర్‌లో శుక్రవారం జరిగింది. స్వర్ణ ప్రాజెక్టు వద్ద  తేనెటీగల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో అధికారులు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో నలుగురు అధికారులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అధికారులు సారంగపూర్ స్వర్ణ ప్రాజెక్టు నుంచి రబీకి నీళ్లు ఇచ్చేందుకు వచ్చినపుడు ఈ ఘటన జరిగింది. 
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
