బంపర్‌ ఆఫర్‌

HMDA Good News For LRS Applications Hyderabad - Sakshi

ఎల్‌ఆర్‌ఎస్‌ఇన్షియల్‌ పేమెంట్‌ ఫీజు చెల్లించని దరఖాస్తుదారులకు అవకాశం  

ఫీజు చెల్లించేలా త్వరలోనే ప్రక్రియ ప్రారంభం  

ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ గడువు రెండు నెలలు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకు సంబంధించి రూ.10వేల ఇన్షియల్‌ పేమెంట్‌ ఫీజు చెల్లించని దరఖాస్తుదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వీరి వ్యధను వివరిస్తూ ‘సాక్షి’ ఈ నెల 27న ‘మాటలేనా’ శీర్షికతో కథనం ప్రచురించింది. ఇన్షియల్‌ పేమెంట్‌ చెల్లించని దరఖాస్తుదారులకు అవకాశమిస్తామని మంత్రి కేటీఆర్‌ హెచ్‌ఎండీఏ సమీక్ష సమావేశంలో ప్రస్తావించారని... ఈ మేరకు హెచ్‌ఎండీఏ లేఖ రాయగా, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో పెండింగ్‌లో ఉందని పేర్కొంది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రి కేటీఆర్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ గడువు పొడిగించడంతో పాటు ఇన్షియల్‌ పేమెంట్‌ చెల్లించని దరఖాస్తుదారులకు అవకాశమిస్తూ నిర్ణయం తీసుకోవాలని మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇన్షియల్‌ పేమెంట్‌ చెల్లించని 9,833 మందికి లబ్ధి చేకూరనుంది. అక్టోబర్‌ 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ గడువు పొడిగించిన ప్రభుత్వం రెవెన్యూ, నీటి పారుదల శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ఎన్‌వోసీల దరఖాస్తుదారులకు కూడా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఫీజు చెల్లించాలని సందేశం...   
హెచ్‌ంఎడీఏ ఐటీ సెల్‌ అధికారులు ‘మీ ఎల్‌ఆర్‌ఎస్‌ రూ.10వేల ఇన్షియల్‌ పేమెంట్‌ చెల్లించాలం’ టూ 9,833 మంది దరఖాస్తుదారుల సెల్‌ నెంబర్లకు మెసేజ్‌లతో పాటు ఈమెయిల్స్‌ పంపించనున్నారు. దరఖాస్తుదారుడు ఫీజు కట్టిన వెంటనే ఆ దరఖాస్తు పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుంది. టైటిల్‌ స్క్రూటిని, టెక్నికల్‌ స్క్రూటిని పూర్తి చేసి సక్రమమని తేలితే క్లియరెన్స్‌ ఇస్తారు. ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజు చెల్లించాలంటూ సదరు దర ఖాస్తుదారుడి సెల్‌ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌లు పం పుతారు. అది చెల్లించగానే ఫైనల్‌ ప్రొసిడింగ్స్‌ జారీ చేస్తారు. ఇలా హెచ్‌ఎండీఏకు వచ్చిన 1,76,036 దరఖాస్తుల్లో 1,00,322 క్లియర్‌ చేశా రు. 54 మంది దరఖాస్తుదారులకు పంపిన షార్ట్‌ఫాల్స్‌ పత్రాలను ఇంకా అప్‌లోడ్‌ చేయలేదు. 1,694 దరఖాస్తులు క్లియరెన్స్‌ ప్రక్రియలో ఉన్నా యి. 2,237 ఎన్‌వోసీలు లేని దరఖాస్తులు పెం డింగ్‌లో ఉన్నాయి. 676 దరఖాస్తులను జీహెచ్‌ఎంసీకి బదిలీ చేశారు. రెండు వేల ఆఫ్‌లైన్‌ ఫైళ్లు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి.

మిగిలిన 61,122 దరఖాస్తులను ఓపెన్‌ స్పేస్, రిక్రియేషనల్, వాటర్‌ బాడీ, మ్యాన్‌ఫాక్చరింగ్, సెంట్రల్‌ స్క్వేర్, ట్రాన్స్‌పోర్టేషన్, బయో కన్జర్వేషన్, ఫారెస్ట్‌ జోన్, మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు,ఓపెన్‌స్పేస్‌ ఆఫ్‌ లేఅవుట్,నది, వాగు, నాలా బఫర్‌ జోన్‌లోని ప్లాట్లు, శిఖంలోని ప్లాట్లు తదితర కారణాలతో తిరస్కరించారు. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియర్‌ అయిన సమాచారం అందు కున్న 1,00,322 దరఖాస్తుల్లో దాదాపు 18,500 మంది ఫీజు చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ గడువు పొడిగించినా... వీరి సంఖ్య మాత్రం అలానే ఉంటోందని, ఈసారైనా తప్పక చెల్లించి ఫైనల్‌ ప్రొసిడింగ్స్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు. వీరి ద్వారా హెచ్‌ఎండీకు దాదాపు రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే తాజాగా ఇన్షియల్‌ పేమెంట్‌ చెల్లించని దరఖాస్తుదారులకు కూడా అవకాశం ఇవ్వడంతో మరో రూ.100 కోట్ల మేర ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు క్లియర్‌ అయిన దర ఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు రూపంలో రూ. 700 కోట్లు, నాలా ఫీజు రూపంలో రూ.250 కోట్లు చెల్లించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top