
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) బాచుపల్లి లే అవుట్‌లోని 70 ఖాళీ ప్లాట్లకు ఈ నెల 18న ఈ–వేలం వేయనుంది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం లే అవుట్‌లో ప్రీబిడ్ మీటింగ్ నిర్వహించింది. ఎస్టేట్ మేనేజ్‌మెంట్ యూనిట్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి వేలంపాట ప్రక్రియ గురించి వివరించారు.
ఎంఎస్‌టీఎస్ ప్రతినిధులు ఈ–వేలం పాట విధానం గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. కేపీఎంజీ ప్రతినిధులు ఈ ప్రాంతంలోని వ్యూహాత్మక ప్రాధాన్యతలు, భవిష్యత్ అభివృద్ధి అవకాశాలపై ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్నవారి నుంచి వచ్చిన సందేహాలకు ఆయా విభాగాల అధికారులు నివృతి చేశారు.
సమావేశంలో హెచ్‌ఎండీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సత్యప్రసాద్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కె.శ్రీకాంత్‌రెడ్డి, ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఈ వేలంలో పాల్గొనాలనుకుంటే, హెచ్‌ఎండీఏ అధికారిక వెబ్‌సైట్లో ఆక్షన్ గైడ్, ప్లాట్ వివరాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ చూడవచ్చు.