
సాక్షి, హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారతీయ పౌరసత్వం రద్దుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లను హైకోర్టు ఆరు వారాలపాటు సస్పెండ్ చేసింది. దీనిపై మళ్లీ వాదనలు వింటామని హైకోర్టు స్పష్టంచేసింది.
రమేష్ జర్మన్ దేశ పౌరుడని, ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గతంలో విచారించింది.