హెచ్‌ఐవీ ఉంటే ఉద్యోగం ఇవ్వరా?

high court on Dependent Employment Quota job - Sakshi

సింగరేణి తీరును తప్పుపట్టిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: డిపెండెంట్‌ ఎంప్లాయిమెంట్‌ కోటా కింద హెచ్‌ఐవీ బాధితుడికి ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించిన సింగరేణి యాజమాన్యం తీరును ఉమ్మడి హైకోర్టు తప్పుపట్టింది. ఆ వ్యక్తి భూ గర్భంలో పనిచేయలేకపోతే, ఉపరితలంపై చేసే పనిని అప్పగించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు ఇటీవల తీర్పు వెలువరించారు. పిటిషనర్‌ తండ్రి అనారోగ్య కారణాలతో ఉద్యోగం చేయలేన్నందున, పిటిషనర్‌కు డిపెండెంట్‌ కోటా కింద ఉద్యోగమిచ్చి మూడు నెలల్లో ఉత్తర్వులివ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.

తన తండ్రి అనారోగ్యం నేపథ్యంలో డిపెండెంట్‌ కోటా కింద తనకు ఉద్యోగమివ్వాలన్న అభ్యర్థనను.. హెచ్‌ఐవీ ఉందన్న కారణంతో తిరస్కరించిందని కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సింగరేణి కాలరీస్‌ కౌంటర్‌ దాఖలు చేస్తూ, హెచ్‌ఐవీ, హెపటైటీస్‌–బి ఉన్న వారు భూగర్భంలో పని చేయడానికి అనర్హులని, వీరికి ఉపరితలంపై బాధ్యతలు అప్పగిస్తామని తెలిపింది. దీనిని ప్రత్యేక కేసుగా పరిగణించాలని హైకోర్టు పేర్కొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top