కోడలే కూతురైన వేళ

Helpage India Survey about relation between Daughter-in-law and mother in law - Sakshi

కోడలు కాదు కొరివి దెయ్యం, కుటుంబంలో చిచ్చుపెట్టి తల్లీబిడ్డల్ని వేరు చేసే గయ్యాళి, ఆమె కాలు పెట్టిన వేళావిశేషం ఏమిటో కానీ అన్నీ కష్టాలే... ఇకపై ఇలాంటి సన్నాయి నొక్కులకు కాలం చెల్లిపోయింది. ఎందుకంటే వయసు మీద పడిన అత్తమామల్ని పసిపిల్లల మాదిరిగా చూసుకోవడంలో కోడళ్లే ముందుంటున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ఒక తల్లికి కూతురు ఎంత ప్రేమగా అన్ని సేవలు చేస్తుందో కోడళ్లు కూడా అంతే ప్రేమగా అత్తమామల్ని చూసుకుంటున్నరని హెల్ప్‌ ఏజ్‌ ఇండియా అధ్యయనంలో వెల్లడైంది. మంచాన పడ్డ తల్లిదండ్రుల్ని చూసుకోవాలంటే కన్న కొడుకులే విసుక్కుంటూంటే కోడళ్లు మాత్రం కూతురిలా సేవలు చేస్తున్నారని తెలిపింది.

భారత్‌లో 20 నగరాల్లో 3 వేల కుటుంబాలపై ఈ సర్వే నిర్వహించారు. ఇంట్లో పెద్దవాళ్లకి అవసరమైన వంట చేయడం, వేళకు మందులు ఇవ్వడం, వారిని వాకింగ్‌కి తీసుకువెళ్లడం, వీకెండ్లలో సరదాగా ఎక్కడికైనా తీసుకువెళ్లడం వంటి పనులన్నీ 68 శాతం మంది కోడళ్లే చేస్తున్నారు. కొడుకుల్లో 51 శాతం చూస్తున్నారు. పెద్దవాళ్లకి కావల్సిన ఆర్థిక అవసరాలు తీర్చడంలో కూడా ఫస్ట్‌ ప్లేస్‌ కోడళ్లదే. తమ సంపాదనలో అత్తమామలకు ఖర్చు పెడుతున్న కోడళ్లలో 26 శాతం ఉంటే, కూతుళ్లు 23 శాతం మంది ఉన్నారని వివరించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top