
సాక్షి, హైదరాబాద్ : వాయవ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో కూడా అల్పపీడనం కొనసాగుతోంది. ఈ కారణంగా రేపు ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాష్ట్రంలో మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
వివిధ ప్రాంతాలలో నమోదైన వర్షపాతం: భూపాలపల్లి జిల్లాలోని పెరూర్‌లో 4 సెం.మీ, భూపాలపల్లి 2 సెం.మీ, వెంకటాపురం 1 సెం.మీ, కాళేశ్వరం 1 సెం.మీ, చెన్నూరు (మంచిర్యాల)1 సెంమీ, గంగాధర (కరీంనగర్) 1 సెం.మీ.