బియ్యం మాఫియాపై ఉక్కుపాదం

Heavy focus on rice mafia - Sakshi

      రిటైర్డ్‌ ఎస్పీ నేతృత్వంలో నిఘా వ్యవస్థ

     వివిధ శాఖలకు చెందిన 20 మంది అధికారులతో ఐదు బృందాలు

     184 కేసుల నమోదు – రూ.3 కోట్ల విలువైన బియ్యం స్వాధీనం

     తొలిసారి పీడీ యాక్టు అమలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా పంపిణీ కార్యక్రమాన్ని గాడిలో పెట్టేందుకు, ప్రధానంగా రేషన్‌ బియ్యం సరఫరాలో అక్రమాలను అడ్డుకునేందుకు పౌరస రఫరాల శాఖ చేసిన ప్రయోగం సత్ఫలితాలను ఇస్తోంది. ఎస్పీ ర్యాంకు రిటైర్డ్‌ పోలీసు అధికారి నేతృత్వంలో ఏర్పాటుచేసిన నిఘా వ్యవస్థతో రేషన్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపినట్లయ్యింది. ఈ శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేయకముందు ఇక్కడి వ్యాపారులు రేషన్‌ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకునేవారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌ శాఖ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకు న్నాక.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టాస్క్‌ఫోర్సుకు శ్రీకారం చుట్టారు. నిత్యావసర సరుకుల పంపిణీలో అవినీ తిని నిరోధించడం, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, రైస్‌మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్ల ఆగడాలను అదుపు చేసేందుకు రిటైర్డ్‌ పోలీసు అధికారులతోపాటు, రెవిన్యూ, కమర్షియల్‌ ట్యాక్స్, తదితర శాఖలకు చెందిన 20 మందితో అయిదు బృందాలుగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని తొమ్మిది నెలల కిందట ఏర్పాటు చేశారు.

మండల స్థాయి గోదాములు, రేషన్‌ దుకాణాలు, సీఎంఆర్‌ మిల్లులు, మధ్యాహ్న భోజనంకోసం సన్నబియ్యం అందుకునే సంస్థలు, హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, ఎల్పీజీ గోదాములు, రైళ్లు తదితర ప్రదేశాల్లో మొత్తంగా 639 చోట్ల దాడులు చేశారు. వీరి తనిఖీల్లో రూ.3.10 కోట్ల విలువైన 11వేల 537 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. రైస్‌ మిల్లులపై 139 6ఎ కేసులు, 46 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఈ శాఖ చరిత్రలో తొలిసారి పీడీ యాక్టును కూడా అమలు చేశారు. ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పీడీ కేసులు నమోదయ్యాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడుల్లో రూ.3.44 లక్షల విలువైన చక్కెర, ఎల్పీజీ సిలిండర్లు, కిరోసిన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ బృందాల దాడుల వల్ల ధాన్యంలో తరుగు, సన్నబియ్యం, రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా రూ.4.43కోట్ల విలువైన సరుకు అర్హులకు చేరేలా, అక్రమాలను నివారించగలిగారు.

నిఘాతో మంచి ఫలితాలు
పౌరసరఫరాల శాఖలో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడంవల్ల బియ్యం అక్రమ రవా ణాను నియంత్రించగలి గామని శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ చెప్పారు. ఏటా రూ.10వేల కోట్ల లావాదేవీలు జరిగే సంస్థలో సాంకేతిక పరిజ్ఞా నాన్ని వినియోగిం చుకుని పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయగలుగు తున్నాం. కాంట్రాక్టు పద్ధతిలో రిటైర్డ్‌ ఉద్యోగులను తీసుకుని బృం దాలు తయారు చేశాం. క్షేత్రస్థాయి పనుల్లో వాటిని తనిఖీ చేసే బాధ్యతలను ఈ బృందా లకు అప్పగించామని ఆయన వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top