గురుకుల విద్యార్థులకు ‘ఆరోగ్యమస్తు’

ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ నంబర్‌ కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌: గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై సొసైటీలు దృష్టి సారించా యి. దీనిలో భాగంగా ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ నంబర్‌ను కేటాయించను న్నాయి. విద్యార్థులకు తరుచూ వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆయా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నాయి.

విద్యార్థులు గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందిన వెంటనే ఈ హెల్త్‌ ప్రొఫైల్స్‌ను తెరుస్తారు. టీసీ తీసుకుని వెళ్లే వరకు ఈ ప్రొఫైల్‌ను నిర్వహిస్తారు. ఆరోగ్య, అనారోగ్య సమా చారంతో పాటు శారీరక స్థితి, దేహదారుఢ్యం, ఎత్తు, బరువు తదితర సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రతిసారి రిపోర్టును అప్‌డేట్‌ చేస్తారు. ఈ రిపోర్టుతో విద్యార్థి ఆరోగ్య స్థితిని తెలుసుకోవడంతో పాటు వ్యాధులకు చికిత్స చేయడం సులభతరమవుతుంది.

కమాండ్‌ సెంటర్‌ ద్వారా..
విద్యార్థుల ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ నిర్వహణలో కమాండ్‌ సెంటర్‌ కీలకం కానుంది. ప్రతి గురుకుల పాఠశాలలో ఏఎన్‌ఎం/నర్స్‌ లేదా వైద్య సహాయకుడు అందుబాటులో ఉంటారు. వారు నెలవారీగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఉంచుతారు. అనంతరం వైద్య పరీక్షల ఫలితాలను కమాండ్‌ సెంటర్‌ నుంచి అప్‌డేట్‌ చేస్తారు. ఇందులో వ్యాధులను గుర్తిస్తే వెంటనే చికిత్స అందిస్తారు. హృద్రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లు తెలిస్తే ఆస్పత్రికి తరలిస్తారు. ప్రస్తుతం ప్రాథమిక దశలో (బీటా వెర్షన్‌) ఉన్న ఈ విధానాన్ని త్వరలో అభివృద్ధి చేయనున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

గిరిజన హాస్టళ్లలో...
ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ శాఖ కాల్‌హెల్త్‌ సంస్థ ఆధ్వర్యంలో అందు బాటులోకి తెచ్చింది. ఈ మేరకు ప్రత్యేకంగా కంట్రో ల్‌ రూమ్‌ను తెరిచింది. క్షేత్ర స్థాయిలో వసతి గృహా లు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు 31 రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తూ హెల్త్‌ రికార్డును పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి ఫలితాలను ఆ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇది సఫలమైతే ఎస్టీ గురుకులాల్లోనూ ఇదే తరహా హెల్త్‌ ప్రోగ్రాం నిర్వ హించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top