ప్రాజెక్టుల రీడిజైన్‌తో ముంపు తగ్గించాం | Harish Rao Inspects Kaleshwaram Project Works | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల రీడిజైన్‌తో ముంపు తగ్గించాం

Jul 14 2018 11:23 AM | Updated on Oct 30 2018 7:50 PM

Harish Rao Inspects Kaleshwaram Project Works - Sakshi

 ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలిస్తున్న మంత్రి హరీష్‌రావు

రామగుండం: ప్రాజెక్టుల రీడిజైన్‌తోనే ముంపును తగ్గించి సామర్థ్యం పెంచడం జరిగిందని, నీటి లభ్యత ఉన్న ప్రాంతంలోనే ప్రాజెక్టు నిర్మాణాలకు డిజైన్‌ చేయగా, వాటిని పరిశీలించి కేంద్ర జలవనరుల సంఘం అనుమతులు జారీ చేసిందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన ఎల్లంపల్లి ప్రాజెకు ్టతో పాటు గోలివాడ (సుందిళ్ల)పంపుహౌస్‌ నిర్మా ణ స్థితిగతులను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. కాంగ్రెస్‌ 2004లోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నప్పటికీ అసంపూర్తి పునరావాసం, నీటి నిల్వ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అ ప్పటికప్పుడు భూసేకరణకు రూ.600 కోట్లు కేటాయించి సమస్య పరిష్కరించామని తెలిపారు. 2014లో ఐదు టీఎంసీలు, 2015లో పది టీఎంసీ లు, 2016లో ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలను నిల్వ చేయగలిగామన్నారు.
 
ముంపు తక్కువ సామర్థ్యం ఎక్కువ సీఎం లక్ష్యం  
రైతుల అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు 20.175 టీఎంసీలతో 62 గేట్లతో సుమారు 21 గ్రామాలు, వేలాది ఎకరాలు ముంపుకు గురైందన్నారు. దీంతో పోల్చుకుంటే గతంలో నిర్మించిన మిడ్‌ మానేర్, పులిచింతల ఇంకా ఎక్కువగా ముంపు గురైందన్నారు. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు సాంకేతిక పరిజ్ఞానం, తక్కువ వ్యవధిలోనే ప్రాజెక్టు నిర్మాణం, తక్కువ ముంపు, ఎక్కువ నీటి సామర్థ్యం, గరిష్ట ప్రయోజనాలతో దేశ చరిత్రలో గుర్తింపు వచ్చిందన్నారు. కాళేశ్వరం (మేడిగడ్డ) వద్ద నిర్మించే బ్యారేజీ 85 గేట్లతో నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీలు, అన్నారం బ్యారేజీ 66 గేట్లతో 11 టీఎంసీలు, సుందిళ్ల బ్యారేజీ 9 టీఎంసీలు, 74 గేట్లతో నిర్మిస్తున్నామన్నారు. ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో 115 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు పైకివస్తాయన్నారు.
 
పనుల పురోగతిపై సంతృప్తి... 
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలతో పాటు సబ్‌స్టేషన్ల నిర్మాణాలపై మంత్రి హరీష్‌రావు సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు గరిష్ట ఉష్ణోగ్రతలు, వర్షాలను లెక్కచేయకుండా పనులు నిరాటంకంగా కొనసాగిస్తున్నారని కొనియాడారు. అయినప్పటికీ అ«ధికారులు పేర్కొన్న నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి కాకపోవడం పట్ల జరిగే జాప్యంపై అధికారులతో చర్చించారు. గోలివాడ పంపుహౌస్‌ వద్ద ఈనెల 25న నాలుగు మోటార్లను ప్రారంభించి 400 కేవీ సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ఉత్పత్తి ప్రారంభిస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ నల్ల వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ విజయభాస్కర్, ఈఈ సత్యరాజ్‌ చంద్ర, డీఈ రాజమల్లు, ఏఈ శివసాగర్, ట్రాన్స్‌కో అధికారి సుజన్‌ ఉన్నారు.
 
ఎల్లంపల్లి గేట్ల పని విధానంపై సమీక్ష 
ఎల్లంపల్లి ప్రాజెక్టులో బిగించిన గేట్ల పని విధానాన్ని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అధికారులతో సమీక్షించారు. ఈ మేర కు ఆయన శుక్రవారం ఎల్లంపల్లి ప్రాజెక్టును ఆకస్మికంగా సందర్శించారు. మేడిగడ్డ, అన్నారం, స ందిళ్ల బ్యారేజీలకు గేట్ల బిగింపు, ఎల్లంపల్లి ప్రా జెక్టు గేట్ల బిగింపుపై అధికారులతో చర్చించా రు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను హైడ్రాలిక్‌ విధానంతో బిగించగా, మూడు ప్రాంతంలో ఆపరేటి ంగ్‌ విధా నాన్ని ఏర్పాటు చేశారని అధికారులు తెలి పారు. ఇదే పద్ధతిలో సుందిళ్ల బ్యారేజీకి ఎందుకు బిగించలేదని అధికారులను మంత్రి ప్రశ్నించగా.. సుం దిళ్ళ బ్యారేజీకి  రోప్‌ డ్రమ్‌ ఆయిల్‌ సిస్టం (ఆర్‌డీఓఎస్‌) విధానంతో గేట్లను ఎత్తివేయవచ్చన్నారు. కగా స్విచ్‌ యార్డుగది అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించిన మంత్రి ఎస్‌ఈని మందలించారు.
 
ఆగస్టు నెలాఖరులో కాళేశ్వరం నీరు విడుదల 
ధర్మారం(ధర్మపురి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పనులు నెలరోజుల్లో పూర్తిచేసి అగస్టు నెలాఖరులోగా ఎల్లంపల్లి నీటిని విడుదల చేస్తామని హరీష్‌రావు తెలిపారు. ధర్మారం మండలం మేడారం శివారులో కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఆరోప్యాకేజీ పనులు శుక్రవారం పరిశీలించారు. గురువారం రాత్రి 12 గంటలకు మేడారంలోని నవయుగ క్యాంపు కార్యాలయానికి చేరుకున్న మంత్రి రాత్రి ఇక్కడే బసచేశారు. ఉదయం టన్నెల్‌లో జరుగుతున్న పనులు సందర్శించారు. మం త్రి వెంట సీఈ వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ వెంకట్రాము లు, ఈఈ శ్రీధర్, నవయుగ కంపెనీ డీపీఎం శ్రీనివాస్, డీఈఈ నర్సింగరావు, ఏఈలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement