ఇతర రాష్ట్రాల ఇసుకకు 'చెక్' | harish rao held meeting over illigal sand | Sakshi
Sakshi News home page

ఇతర రాష్ట్రాల ఇసుకకు 'చెక్'

Dec 1 2015 7:27 PM | Updated on Sep 3 2017 1:19 PM

ఇతర రాష్ట్రాల ఇసుకకు 'చెక్'

ఇతర రాష్ట్రాల ఇసుకకు 'చెక్'

ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న అక్రమ ఇసుక వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వస్తోందని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.

హైదరాబాద్: ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న అక్రమ ఇసుక వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వస్తోందని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. వివిధ శాఖల అధికారులతో ఆయన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చెక్‌పోస్టుల నిర్వహణ కఠినతరం చేయాలన్నారు. అవసరమైతే చెక్‌పోస్టులు భారీగా ఏర్పాటు చేసేందుకు ప్లాన్ సిద్ధం చేసుకోవాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని 14 మండలాల్లో అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్‌ను వెంటనే అరికట్టాలని అధికారులకు సూచించారు.

మిషన్ కాకతీయ కింద గండిపేట్ చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. గండిపేట చెరువు పునరుద్ధరణకు టెండర్లు పిలిచి పనులను ప్రారంభించాలని సూచించారు. రూ. 12 కోట్లతో ఫస్ట్ ఫేజ్ పనులను ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement