ఉచితమని.. డబ్బులు కట్టమంటున్నారు !

Gulf Migrant Workers Worried About Paid Quarantines - Sakshi

గల్ఫ్‌ వాపసీల ఆవేదన

హైదరాబాద్‌లో పేయిడ్‌ క్వారంటైన్‌

ప్రభుత్వమే చెల్లించాలని విన్నపం

ఇబ్రహీంపట్నం(కోరుట్ల): ‘గల్ఫ్‌ నుంచి స్వదేశానికి వచ్చే వారికి ఉచితంగా క్వారంటైన్‌ సౌకర్యం కల్పిస్తామన్న ప్రభుత్వం.. తీర ఇక్కడికొచ్చాక డబ్బులు చెల్లించమంటుంది’ అని ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన మోహన్, అబ్బ రాకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వీరు కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకోగానే ప్రభుత్వం బేగంపేటలోని ఓ హోటల్‌లో క్వారంటైన్‌ చేసింది. వీరిద్దరితోపాటు నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లికి చెందిన పలువురు గల్ఫ్‌ వాపసీలు అక్కడే క్వారంటైన్‌లో ఉంటున్నారు. అయితే వీరందరినీ అధికారులు క్వారంటైన్‌లో ఉన్నందుకు ఒక్కొక్కరు రూ.15 వేలు చెల్లించాలంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అప్పులు చేసి గల్ఫ్‌ బాట
ఉన్న ఊరిలో ఉపాధి కరువై గల్ఫ్‌ దేశాల బాట పట్టిన వారు రూ.4లక్షల నుంచి రూ.4.50 లక్షల వరకు అప్పు చేశారు. అయితే కరోనా ప్రభావంతో అక్కడ కంపెనీల్లో పనులు సరిగ్గా లేక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్‌లో ఉంచేందుకు ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందని తాము తిరిగి వచ్చినట్లు వారంత పేర్కొంటున్నారు. ఇబ్రహీంపట్నంకు చెందిన అబ్బ రాకేశ్, మండలంలోని వేములకుర్తికి చెందిన మోహన్‌తోపాటు నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లికి చెందిన ముగ్గురు, కమ్మర్‌పల్లి మండలం ఆశకొత్తూర్‌కు చెందిన ఇద్దరు, భీంగల్‌కు చెందిన ముగ్గురు, కోనసముందర్‌ గ్రామానికి చెందిన ఒకరు, వెల్పూర్‌కు చెందిన ఒకరు కువైట్‌ నుంచి ఈ నెల 10న హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వీరందరినీ బేగంపేటలోని కామత్‌ హోటల్‌లోని క్వారంటైన్‌కు తరలించారు.

ప్యాకేజీలతో బెంబేలు
కువైట్‌ నుంచి బయలుదేరే సమయంలో హైదరాబాద్‌లో హోటల్‌లో ఉండేందుకు రూ.5 వేలు, రూ.15 వేలు, రూ.30 వేలు ప్యాకేజీ చూపించారని, ఇక్కడికొచ్చాక రూ.15 వేలు, రూ.30 వేలు ప్యాకేజీలు అని చెప్పి ఒక్కొక్కరు రూ.15 వేలు చెల్లించాలని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద డబ్బులు లేవని, అప్పు చేసి కువైట్‌ పోయామని, ఎక్కడి నుంచి కట్టాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు. క్వారంటైన్‌లో మంచిగానే చూసుకుంటున్నారని, నిత్యం వైద్యులు వచ్చి పరీక్షిస్తున్నారని వారు తెలిపారు. ఉదయం టీ, టిఫిన్‌తోపాటు రెండు పూటల భోజనం పెడుతున్నారని తెలిపారు. అయితే డబ్బుల విషయంలో ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

26-05-2020
May 26, 2020, 03:32 IST
న్యూఢిల్లీ: హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 10 శాతం...
26-05-2020
May 26, 2020, 03:03 IST
న్యూఢిల్లీ: కరోనా  వ్యాప్తి కట్టడి కోసం లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ పోవడమనేది ఆర్థిక వినాశనానికి దారితీస్తుందని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌...
26-05-2020
May 26, 2020, 02:42 IST
సాక్షి, హైదరాబాద్‌/శంషాబాద్‌ : కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా 2 నెలలుగా నిలిచిన దేశీయ విమానాల రాకపోకలు సోమవారం తిరిగి...
26-05-2020
May 26, 2020, 01:56 IST
లాక్‌డౌన్‌ ప్రభావం ఇంకా చాలాకాలం ఉంటుందని, పొదుపు పాటిస్తామని చెప్పినవారు : 82%  ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు మొగ్గు చూపినవారు : 44%  స్థానిక కిరాణా దుకాణాలపైనే...
26-05-2020
May 26, 2020, 00:10 IST
సినిమా షూటింగ్‌ అంటే సందడి. ఓ హడావిడి. ఓ గందరగోళం. లొకేషన్‌ అంతా యూనిట్‌ సభ్యులతో కిటకిటలాడుతుంది. రానున్న రోజుల్లో...
25-05-2020
May 25, 2020, 22:37 IST
కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 31 మంది, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు ఉండగా.. వలసదారులు 15 మంది..
25-05-2020
May 25, 2020, 19:51 IST
ముంబై: దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. దేశ‌వ్యాప్తంగా న‌మోద‌వుతున్న కేసుల్లో మ‌హారాష్ట్ర‌లోనే స‌గానికిపైగా ఉన్నాయి. ఇక్క‌డి ముంబై క‌రోనా పీడితులకు ఆల‌వాలంగా...
25-05-2020
May 25, 2020, 19:37 IST
ఒక్కపక్క కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న అసోం రాష్ట్రాన్ని ఇప్పుడు వరదలు వణికిస్తున్నాయి.
25-05-2020
May 25, 2020, 18:20 IST
విపరీతమైన రద్దీ నేపథ్యంలో.. ఆ ట్రైన్‌ను ఒడిషా మీదుగా ఉత్తర్‌ప్రదేశ్‌కు తీసుకెళ్లారు. దాంతో 25 గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన రైలు...
25-05-2020
May 25, 2020, 17:23 IST
రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గడంతో బాబు మళ్లీ ఏపీ బాట పట్టారని ఎద్దేవా చేశారు. ఆయనను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి...
25-05-2020
May 25, 2020, 17:05 IST
ఫ్యాక్టరీలు తెరుచుకున్నాక ప్రభుత్వం అనుమతించడం పట్ల పరిశ్రమల యజమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
25-05-2020
May 25, 2020, 17:00 IST
తిరువనంతపురం: కేర‌ళ‌లో విచిత్ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. పండు త‌ల మీద ప‌డ‌టంతో తీవ్ర‌గాయాల‌పాలైన వ్య‌క్తికి క‌రోనా సోకిన‌ట్లు తేలింది. వివ‌రాల్లోకి వెళ్తే.....
25-05-2020
May 25, 2020, 16:46 IST
అయితే, అంతకు క్రితమే సేకరించిన వారి లాలాజల నమూనాలను పరీక్షించగా.. ఆ ముగ్గురిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ...
25-05-2020
May 25, 2020, 16:06 IST
ముంబై : మ‌హారాష్ర్ట‌లో క‌రోనా మృత్యు ఘంటిక‌లు మోగిస్తున్న వేళ‌..కోవిడ్ రోగుల‌కు చికిత్స అందించ‌డానికి అత్య‌వ‌స‌రంగా వైద్య‌లను పంపాల‌ని కేర‌ళ...
25-05-2020
May 25, 2020, 15:54 IST
పటిష్ట లాక్‌డౌన్‌ కారణంగా అప్పుడు విద్యార్థులు ఇళ్లకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.
25-05-2020
May 25, 2020, 15:23 IST
అలాంటప్పుడు లాక్‌డౌన్‌ విధించిన లాభమేమిటీ? అని నిపుణులు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
25-05-2020
May 25, 2020, 13:02 IST
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: గమ్యానికి వెళుతూ ఓ వలస కూలీ మృతి చెందాడు. ఒడిశాలోని బరంపురం సమీపంలో పాశియా గ్రామానికి...
25-05-2020
May 25, 2020, 12:26 IST
సాక్షి, ముంబై:  బాలీవుడ్  సూపర్  స్టార్  సల్మాన్ ఖాన్ కొత్త వ్యాపరంలోని అడుగు పెట్టాడు. కరోనా సంక్షోభ సమయంలో  సమయానికి తగినట్టుగా శానిటైజర్...
25-05-2020
May 25, 2020, 12:22 IST
న్యూయార్క్‌ : ‘రీ ఓపెన్‌ అమెరికా’ ఉద్యమం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘రీ...
25-05-2020
May 25, 2020, 11:53 IST
బీజింగ్‌ : దక్షిణ చైనా సముద్రంపై పట్టు కోసం చైనా కరోనా వైరస్‌ వ్యాప్తిని ఉపయోగిస్తుందనే వార్తలను ఆ దేశం కొట్టిపారేసింది. ఆ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top