కరెంట్ స్తంభానికి కట్టేశాడు! | Grazier over action on the farmer | Sakshi
Sakshi News home page

కరెంట్ స్తంభానికి కట్టేశాడు!

Apr 25 2016 6:12 AM | Updated on Oct 1 2018 2:00 PM

కరెంట్ స్తంభానికి కట్టేశాడు! - Sakshi

కరెంట్ స్తంభానికి కట్టేశాడు!

రంగారెడ్డి జిల్లాలో రూ.10 వేల బాకీ ఇవ్వలేదని పశువుల వ్యాపారి ఓ రైతును విద్యుత్ స్తంభానికి కట్టేశాడు.

వికారాబాద్‌లో రైతన్నపై పశువుల వ్యాపారి దాష్టీకం
 
 వికారాబాద్: రంగారెడ్డి జిల్లాలో రూ.10 వేల బాకీ ఇవ్వలేదని పశువుల వ్యాపారి  ఓ రైతును విద్యుత్ స్తంభానికి కట్టేశాడు. వికారాబాద్ మండల పరిధిలోని ధన్నారం గ్రామానికి చెందిన వడ్డే యాదయ్య (38) రెండేళ్ల కిందట ధారూరు మండల కేంద్రానికి చెందిన ఓ పశువుల వ్యాపారి వద్ద కాడెద్దులు కొనుగోలు చేశాడు. వీటి ధర రూ. 27 వేలు. ఇందులో రూ. 17 వేలు రెండు విడతల్లో తీర్చాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మిగిలిన రూ.10 వేలు చెల్లించలేకపోయాడు. ఆదివారం మిత్రుడి కోరిక మేరకు వికారాబాద్ పశువుల సంతకు వచ్చిన యాదయ్య.. సదరు వ్యాపారికి తారసపడ్డాడు.

అంతే.. మరో ఆలోచన లేకుండా రైతును తాడుతో అక్కడే ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టేశాడు. ‘రెండేళ్లుగా.. నీ కోసమే ఎదురు చూస్తున్నా.. అప్పు తీర్చమని మీ ఇంటికి వస్తే.. ఇబ్బందుల పాల్జేశావు. నిన్ను ఎవరు విడిపిస్తారో చూస్తా..’ అంటూ వ్యాపారి హెచ్చరించాడు. కరువు పరిస్థితుల్లో తీసుకున్న అప్పు తీర్చులేకపోయానని, పనిచేసి అయినా.. అప్పు తీరుస్తానని, కొంత సమయం కావాలని వ్యాపారిని రైతు అభ్యర్థించాడు. కానీ, వ్యాపారి కనికరిం చకుండా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించాడు. పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement