ట్రావెల్స్ బస్సులో భారీగా బంగారు ఆభరణాల చోరీ | Gold robbery in private travels bus in mahaboobnagar District | Sakshi
Sakshi News home page

ట్రావెల్స్ బస్సులో భారీగా బంగారు ఆభరణాల చోరీ

Jun 27 2015 10:47 AM | Updated on Sep 3 2017 4:28 AM

ట్రావెల్స్ బస్సులో భారీగా బంగారు ఆభరణాల చోరీ

ట్రావెల్స్ బస్సులో భారీగా బంగారు ఆభరణాల చోరీ

ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ బంగారం చోరీ జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల వద్ద ఈ ఘటన వెలుగుచూసింది.

మహబూబ్‌నగర్: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ బంగారు ఆభరణాల చోరీ జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల వద్ద ఈ ఘటన వెలుగుచూసింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ వస్తోంది. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల బస్టాండ్‌కు చేరుకున్న సమయంలో బస్సు ప్రయాణికుడు ఒకరు తన బ్యాగ్‌లోని 11 కిలోల బంగారు ఆభరణాలు కనిపించటం లేదని గుర్తించారు. దాంతో ఆ విషయాన్ని డ్రైవర్ చెప్పి... బస్టాండ్‌లోని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కోయింబత్తూరు నుంచి మొత్తం 15 కేజీల బంగారాన్ని తీసుకు వస్తున్నానని.... కానీ తన బ్యాగ్లో నాలుగు కేజీల బంగారం మాత్రమే ఉందని ఆ ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు బస్సులో తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సదరు బంగారం మొత్తం హైదరాబాద్లోని జ్యూయలరీ షాపుకు తీసుకు వెళ్తున్నట్లు పోలీసులకు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement